iDreamPost

వీడియో: పాక్‌ బౌలర్‌ పరువుతీసిన అర్షదీప్‌! కోహ్లీనే షాక్‌ అయ్యాడు!

  • Published Jun 11, 2024 | 10:28 AMUpdated Jun 11, 2024 | 10:28 AM

Arshdeep Singh, Mohammad Amir, IND vs PAK, Virat Kohli: పాకిస్థాన్‌ సీనియర్‌ బౌలర్‌ పరువుతీశాడు అర్షదీప్‌ సింగ్‌. ఈ సీన్‌ చూసి కోహ్లీనే షాక్‌ అయ్యాడు. అసలు ఏం జరిగింది? ఎందుకు అర్షదీప్‌ అలా చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Arshdeep Singh, Mohammad Amir, IND vs PAK, Virat Kohli: పాకిస్థాన్‌ సీనియర్‌ బౌలర్‌ పరువుతీశాడు అర్షదీప్‌ సింగ్‌. ఈ సీన్‌ చూసి కోహ్లీనే షాక్‌ అయ్యాడు. అసలు ఏం జరిగింది? ఎందుకు అర్షదీప్‌ అలా చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jun 11, 2024 | 10:28 AMUpdated Jun 11, 2024 | 10:28 AM
వీడియో: పాక్‌ బౌలర్‌ పరువుతీసిన అర్షదీప్‌! కోహ్లీనే షాక్‌ అయ్యాడు!

టీ20 వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆదివారం నసావు కౌంటీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి, పిచ్‌ కండీషన్స్‌కు వ్యతిరేకంగా తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చినా.. టీమిండియా గెలిచి సత్తా చాటింది. బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమై.. 119 పరుగులకే ఆలౌట్‌ అయింది. కానీ, భీకరమైన బౌలింగ్‌ ఎటాక్‌తో పాక్‌ బ్యాటింగ్‌ను కట్టిపడేసి.. 119 పరుగుల స్వల్ప టార్గెట్‌ను కాపాడుకోగలింది. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్‌ అర్షదీప్‌ సింగ్‌.. పాకిస్థాన్‌ సీనియర్‌ బౌలర్‌ మొహమ్మద్‌ ఆమీర్‌ పరువుతీశాడు.

అర్షదీప్‌ సింగ్‌ చేసిందే హైలెట్‌ అనుకుంటే.. దానికి టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఇచ్చిన రియాక్షన్‌ మరింత హైలెట్‌గా ఉంది. అయితే.. చాలా మంది మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఈ సీన్‌ను పెద్దగా గమనించి ఉండరు. కానీ, మ్యాచ్‌ పూర్తి అయ్యాక నిన్నటి(సోమవారం) నుంచి అర్షదీప్‌ సింగ్‌ చేసిన హంగామా, దానికి కోహ్లీ ఇచ్చిన రియాక్షన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అబ్బో అర్షదీప్‌ సింగ్‌ గడుసోడే అంటూ క్రికెట్‌ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. టీమిండియా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Kohli

పాకిస్థాన్‌ సీనియర్‌ బౌలర్‌ మొహమ్మద్‌ ఆమీర్‌ ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ వేశాడు. ఆ ఓవర్‌ చివరి బాల్‌కి అర్షదీప్‌ సింగ్‌ స్ట్రైక్‌లో ఉన్నాడు. అయితే.. ఎదురుగా ఉంది ఓ సీనియర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ అనే భయం, గౌరవం లేకుండా.. వికెట్లను పూర్తిగా వదిలేసి ఎక్కడో లెగ్‌ సైడ్‌ వైడ్‌ లైన్‌ దగ్గరికి వెళ్లి నిల్చున్నాడు. వికెట్లు అన్ని వదిలేశా దమ్ముంటే బౌల్డ్‌ చేయ్‌ అని ఆమీర్‌కు సవాల్‌ విసిరినట్లు ఉంది ఆ సీన్‌. బాల్‌ వికెట్లకు వేస్తే.. కొట్టాలని అర్షదీప్‌ సింగ్‌ ప్లాన్‌.. కానీ, ఆమీర్‌ అవుట్‌ సైడ్‌ది ఆఫ్‌ స్టంప్‌ బాల్‌ వేశాడు. దాన్ని ఆడటంతో అర్షదీప్‌ విఫలం అయ్యాడు. అయినా కూడా అతని కాన్ఫిడెన్స్‌కు ఏకంగా విరాట్‌ కోహ్లీనే షాక్‌ అయ్యాడు. తన పక్కనే కూర్చున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో అర్షదీప్‌ సింగ్ ఏం చేస్తున్నాడో అంటూ చెబుతూ నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి