iDreamPost

తీవ్ర అనారోగ్యంతో ప్రముఖ నటి.. ఇంటికి వెళ్లిన హీరో అర్జున్‌!

ప్రముఖ సీనియర్‌ నటి లీలావతి ఇంటికి హీరో అర్జున్‌ సార్జా వెళ్లారు. ఆమె అనారోగ్యం గురించి ఎంక్వైరీ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రముఖ సీనియర్‌ నటి లీలావతి ఇంటికి హీరో అర్జున్‌ సార్జా వెళ్లారు. ఆమె అనారోగ్యం గురించి ఎంక్వైరీ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తీవ్ర అనారోగ్యంతో ప్రముఖ నటి.. ఇంటికి వెళ్లిన హీరో అర్జున్‌!

హీరో అర్జున్‌ సార్జా కూతురు ఐశ్వర్య పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. అతి త్వరలో ఆమె పెళ్లి జరగనున్న నేపథ్యంలో పెళ్లి ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంత రాష్ట్రం కర్ణాటక వెళ్లారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో మంచానికి పరిమితమైన ప్రముఖ సీనియర్‌ నటి లీలావతి ఇంటికి ఆయన వెళ్లారు. శనివారం, నేలమంగళ, సోలదేవనహళ్లిలో ఉన్న ఆమె ఇంటికి వెళ్లారు. ఆరోగ్యం గురించి ఎంక్వైరీ చేశారు. మంచంపై పడిఉన్న ఆమె చేతుల్ని చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా పలకరించారు.

ఆమె కుమారుడు వినోద్‌రాజ్‌తో మాట్లాడి తల్లి అనారోగ్యం గురించిన సమాచారం తెలుసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో అర్జున్‌.. లీలావతి ‘‘ అమ్మా! నేను గుర్తుకు ఉన్నానా?’’అని అడిగారు. అందుకు ఆమె సమాధానం చెప్పలేకపోయింది. వినోద్‌ రాజ్‌ స్పందిస్తూ.. ‘ అస్సలు మాట్లాడలేకపోతోంది’ అని అన్నారు. అర్జున్‌.. లీలావతి వైపే చూస్తూ ఉండిపోయారు. కొద్దిసేపటి తర్వాత ..

‘‘అమ్మా! నేను వెళుతున్నాను.. మీరు విశ్రాంతి తీసుకోండి’’ అని అన్నారు. తర్వాత అక్కడినుంచి వచ్చేశారు. ఇంటినుంచి బయటకు వచ్చే ముందు వినోద్‌ రాజ్‌ పెంపుడు శునకంతో అర్జున్‌ సరదాగా గడిపారు. టౌన్‌కు దూరంగా ఫార్మ్‌ హౌస్‌లో చెట్ల మధ్య నివాసం ఉంటున్న వినోద్‌రాజ్‌పై ప్రశంసలు కురిపించారు. లీలావతి ఆర్యోగం త్వరగా బాగు కావాలని ఆ హనుమాన్‌ను ప్రార్థిస్తానని అన్నారు. ఇక, లీలావతి గత కొన్నేళ్ల నుంచి వయోభార సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.

ఆమె అనారోగ్యంపై గత తెలుగు, కన్నడ, తమిళ భాషలకు చెందిన సినీ ప్రముఖులు ఎంక్వైరీ చేస్తున్నారు. లీలావతి 1963లో విడుదలైన వాల్మీకి సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగులో మొత్తం మూడు సినిమాలు చేశారు. ఎక్కువగా మాతృ భాష అయిన కన్నడలోనే సినిమాలు చేశారు. 2009లో విడుదలైన ‘యారాదు’ సినిమా తర్వాత చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారు. ఈ సినిమాకు ఆమే నిర్మాత కావటం విశేషం. ఈ చిత్రంలో ఆమె కుమారుడు ‘వినోద్‌ రాజ్‌’ నటించారు.

కాగా, అర్జున్‌ సార్జా కుమార్తె ‘ ఐశ్వర్య’ ప్రముఖ తమిళ నటుడు రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యతో ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా, వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. అతి కొద్దిమంది బంధుమిత్రులు, ఆప్తులు మాత్రమే ఈ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. మరి, అర్జున్‌.. సీనియర్‌ నటి లీలావతిని పరామర్శించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.