iDreamPost

Aranyak Report : అరణ్యక్ రిపోర్ట్

Aranyak Report : అరణ్యక్ రిపోర్ట్

aరవీనాటాండన్ అంటే ఇప్పటి ప్రేక్షకులకు వెంటనే గుర్తుకురాకపోవచ్చు కానీ నిన్నటి తరం యూత్ లో ఆవిడ సుపరిచితురాలే. పాతికేళ్ల క్రితం వచ్చిన బాలకృష్ణ బంగారు బుల్లోడుతో టాలీవుడ్ జనానికి పరిచయమయ్యింది. రథసారధి, ఉపేంద్ర లాంటి మరికొన్ని చిత్రాలు తనకు చక్కని గుర్తింపునిచ్చాయి. బాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ స్టార్ గా వెలిగిన రవీనాటాండన్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని అరణ్యక్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో ఇటీవలే స్ట్రీమింగ్ మొదలుపెట్టిన ఈ ఫారెస్ట్ థ్రిల్లర్ కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ట్రైలర్ తదితరాలు ప్రామిసింగ్ గానే అనిపించాయి. ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం

ఉత్తర భారతదేశంలో సిరోనా అనే హిల్ స్టేషన్ లో ఎస్ఐగా పని చేసే కస్తూరి డోగ్రా(రవీనాటాండన్) కూతురి చదువు కోసం ఒక ఏడాది లాంగ్ లీవ్ పెట్టాలని నిర్ణయం తీసుకుంటుంది. ఆమె స్థానంలో అంగద్ మల్లిక్(పరంబత్రా చటోపాధ్యాయ) వస్తాడు. అయితే బాధ్యతలు బదిలీ జరిగిన రోజే ఫ్రెంచ్ టీనేజర్ అడవిలో హత్య చేయబడి ఉరికి వేలాడుతూ ఉంటుంది. ఆమె తల్లి జూలి(బ్రెష్ణ ఖాన్)ఫిర్యాదు చేస్తుంది. ఆ మర్డర్ కి స్థానిక రాజకీయ నాయకులకు కనెక్షన్ ఉందని అర్థమవుతుంది. దీంతో కస్తూరి సెలవుని రద్దు చేసుకుని తిరిగి డ్యూటీలో చేరుతుంది. ఎన్నో పుకార్లకు హత్యలకు నెలవుగా మారిన ఆ అరణ్యంలో ఏం జరిగిందనేదే అసలు కథ

చదవడానికి లైన్ సింపుల్ గా అనిపించినా మెయిన్ సిరీస్ లో చాలా మలుపులు ఉంటాయి. దర్శకుడు వినయ్ వైకుల్ టేకింగ్, స్టోరీలో మూడ్ ని ప్రతిబింబించేలా చూపించిన వాతావరణం అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయి. ల్యాగ్ ఉన్నప్పటికీ భరించేదిలానే ఉంది. గతంలో సోనీ లివ్ లో వచ్చిన అన్ దేఖీ ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. అయినా కూడా అరణ్యక్ నిరాశ పరచదు. జాకీర్ హుసేన్, రవి ప్రషర్, అశుతోష్ రానా, మహేష్ శెట్టి తదితరుల పర్ఫెక్ట్ క్యాస్టింగ్ ఈ సిరీస్ కి సహజత్వం తెచ్చింది. క్రైమ్ థ్రిల్లర్స్ ని బాగా ఇష్టపడే వాళ్లకు అరణ్యక్ మంచి ఛాయస్ గా నిలుస్తుంది. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా ఉంటే 8 ఎపిసోడ్లను నిక్షేపంగా చూసేయొచ్చు

Also Read : Spider Man No Way Home : స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి