iDreamPost

విషాదం.. ఉరివేసుకుని ఏఆర్ ఎస్సై ఆత్మహత్య

విషాదం.. ఉరివేసుకుని ఏఆర్ ఎస్సై ఆత్మహత్య

ఈ మధ్య పోలీస్ డిపార్ట్ మెంట్ లో కొందరు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొందరు గన్ మిస్ ఫైర్ అయి ప్రాణాలు కోల్పోతుంటే మరికొందరు వ్యక్తిగత కారణాలతో తనువులు చాలిస్తున్నారు. శాంతిభద్రతలను రక్షించి, పౌరుల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డు వేసే పోలీసులు కుటుంబ సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో పోలీస్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఏఆర్ ఎస్సై మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం బావురుగొండలో ఏఆర్‌ ఎస్సై పడిగ శోభన్‌బాబు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శోభన్‌బాబు ప్రస్తుతం సత్తుపల్లి బెటాలియన్‌లో ఏఆర్‌ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే మెడికల్‌ లీవ్‌లో సోమవారం ఇంటికి వచ్చిన శోభన్‌బాబు వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఏఆర్ ఎస్సై అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా మృతుడి భార్య రజిత, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏఆర్ ఎస్సై మృతితో బావురుగొండలో విషాదం నెలకొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి