iDreamPost
android-app
ios-app

ఏఆర్‌ రెహమాన్‌పై ప్రముఖ సంగీత దర్శకుడి సంచలన కామెంట్లు!

  • Published Sep 11, 2023 | 9:05 PM Updated Updated Sep 11, 2023 | 9:05 PM
  • Published Sep 11, 2023 | 9:05 PMUpdated Sep 11, 2023 | 9:05 PM
ఏఆర్‌ రెహమాన్‌పై ప్రముఖ సంగీత దర్శకుడి సంచలన కామెంట్లు!

ప్రపంచ సంగీత దిగ్గజం ఏఆర్‌ రెహమాన్‌పై తోటి సంగీత దర్శకుడు ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఆర్‌ రెహమాన్‌ ప్రజల దగ్గరినుంచి 20 కోట్ల రూపాయలు దోచుకున్నారని అన్నారు. ఏఆర్‌ రెహమాన్‌ ఏర్పాటు చేసిన తాజా కంసర్ట్‌లో చోటుచేసుకున్న అసౌకర్యాలపై తమిళ సంగీత దర్శకుడు దీనా ఈ వ్యాఖ్యలు చేశారు. రెహమాన్‌ తమిళ ప్రజలనుంచి 20 కోట్ల రూపాయలు తీసుకున్నారని, కంసర్ట్‌లో కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా వారిని మోసం చేశారని అన్నారు.

కంసర్ట్‌లో తాగడానికి నీళ్లు కానీ, వాష్‌రూములు కూడా లేవని అన్నారు. వేలల్లో డబ్బులు తీసుకుని కంసర్ట్‌కు వచ్చిన వారిని దారుణంగా మోసం చేశారంటూ మండిపడ్డారు. మహిళలు, పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కంసర్ట్‌లో ఏర్పడిన ప్రతీ అసాకర్యానికి.. అక్కడికి వచ్చిన వారు పడ్డ ఇబ్బందులకు పూర్తి బాధ్యత ఏఆర్‌ రెహమాన్‌దేనని అన్నారు. రెహమాన్‌పై దీనా చేసిన వ్యాఖ్యలు తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.

కాగా, సెప్టెంబర్‌ 10.. ఆదివారం రోజు రెహమాన్‌ చెన్నైలో ‘‘ మరక్కుమా నెంజమ్‌’’ పేరిట ఓ లైవ్‌ కంసర్ట్‌ నిర్వహించారు. ఎప్పటిలాగే రెహమాన్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో ఆ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. వేల రూపాయలు వెచ్చించి మరీ కంసర్ట్‌కు వెళ్లారు. అయితే, సరైన సౌకర్యాలు లేని కారణంగా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది తమ ప్రాణాల మీదకు వచ్చిందని కూడా ఉంటున్నారు. రెహమాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి, ప్రముఖ సంగీత దర్శకుడు దీనా.. ఏఆర్‌ రెహమాన్‌పై 20 కోట్ల రూపాయల మోసం ఆరోపణలు చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbankobet girişgrandpashabet