iDreamPost

శుభవార్త చెప్పిన APS RTC.. ఉద్యోగుల పిల్లలకు జాబ్స్!

శుభవార్త చెప్పిన APS RTC.. ఉద్యోగుల పిల్లలకు జాబ్స్!

ప్రజలకు రవాణా సౌకర్యం కలిగించడంలో ఆర్టీసీది కీలక పాత్ర. మెరుగైన సౌకర్యాలతో, సురక్షితమైన ,సుఖవంతమైన ప్రయాణం చేసేలా ఆర్టీసీ సేవలు అందిస్తుంది. ఈ సంస్థలో కొన్ని వేల మంది ఉద్యోగులు  విధులు నిర్వహిస్తున్నారు. వారందరి కృషితో ఆర్టీసీ వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉంది. జగన్ సర్కార్.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఇలా తరచూ ఆర్టీసీ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం, ఆర్టీసీ సంస్థ గుడ్ న్యూస్ లు చెబుతుంది. తాజాగా మరో శుభవార్తను ఉద్యోగులకు ఏపీఎస్ ఆర్టీసీ చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ప్రభుత్వ ఉద్యోగులు.. సర్వీస్ లో  ఉండగా  మరణిస్తే.. ఆ కుటుంబం  పరిస్థితి ఎలా ఉంటుందో  అర్థం చేసుకోవచ్చు. కన్నవారిని, కుటుంబ పెద్దను పొగొట్టుకున్న బాధలో  కుమిలిపోతుంటారు. అలాంటి  ఉద్యోగుల కుటుంబాలకు ఏపీఎస్ ఆర్టీసీ ఊరట కలిగించే విషయం చెప్పింది.  విధుల్లో ఉండగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇవ్వనున్నారు. 2016 జనవరి నుంచి 2019 డిసెంబరు మధ్య కాలంలో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి  ఉద్యోగం  ఇచ్చినట్లు ఆర్టీసీ సంస్థ అధికారులు తెలిపారు. మొత్తం 294 మందికి కారుణ్య నియామకం కింద ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు చెప్పారు.  రాష్ట్ర ప్రభుత్వం ఔదార్యంతో 2016 జనవరి నుంచి 2019 డిసెంబర్ మధ్య కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చినట్లు ప్రకటించారు.

మొత్తం 294 మందికి కారుణ్య నియామకం కింద ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు అధికారులు చెప్పారు. జూనియర్‌ అసిస్టెంట్-34, ఆర్టీసీ కానిస్టేబుల్‌-99, అసిస్టెంట్‌ మెకానిక్‌-99, కండక్టర్‌-61, ఒక డ్రైవర్‌ పోస్టును భర్తీ చేసినట్టు వెల్లడించారు. మరో వైపు, విద్యాధరపురంలోని ఏపీఎస్ ఆర్టీసీ ట్రాన్స్‌పోర్ట్ అకాడమీలో ఉద్యోగాలు పొందిన వారికి శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయి. ఈ శిక్షణా తరగతులు ప్రారంభోత్సవానికి ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమల రావు హాజరయ్యారు. ఉద్యోగులు క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయాలని ఆయన సూచించారు. మరి.. ఆర్టీసీ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్  రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి