iDreamPost

10th పాసై ఖాళీగా ఉన్నారా? ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి.. మంచి వేతనం

మీరు పదో తరగతి పాసై ఖాళీగా ఉన్నారా? అయితే ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మంచి వేతనం అందుకోవచ్చు. వెంటనే అప్లై చేసుకోండి.

మీరు పదో తరగతి పాసై ఖాళీగా ఉన్నారా? అయితే ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మంచి వేతనం అందుకోవచ్చు. వెంటనే అప్లై చేసుకోండి.

10th పాసై ఖాళీగా ఉన్నారా? ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి.. మంచి వేతనం

తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మీరు పదో తరగతి ఉత్తీర్ణులైతే గవర్నమెంట్ జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. టెన్త్ పాసై ఖాళీగా ఉన్నట్లైతే ఈ ఉద్యోగాలను అస్సలు వదలకండి. తెలంగాణలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ములుగు జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రకటించిన ఖాళీల్లో డిసెక్షన్ హాల్ అటెండెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్,థియేటర్ అసిస్టెంట్,ల్యాబ్ అటెండెట్,రికార్డ్ అసిస్టెంట్ వంటి పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాలను సాధిస్తే మంచి వేతనం అందుకోవచ్చు. పోస్టులను అనుసరించి టెన్త్, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం ఖాళీలు:

32

విభాగాల వారీగా పోస్టులు:

డిసెక్షన్ హాల్ అటెండెంట్:

04

డాటా ఎంట్రీ ఆపరేటర్:

10

ఆఫీస్ సబార్డినేట్:

08

థియేటర్ అసిస్టెంట్:

04

ల్యాబ్ అటెండెంట్:

04

రికార్డ్ అసిస్టెంట్:

02

అర్హత:

పోస్టులను అనుసరించి టెన్త్, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:

కనిష్టంగా 18 ఏళ్లు, గరిష్టంగా 46 ఏళ్లు కలిగి ఉండాలి.

వేతనం:

ఈ ఉద్యోగాలకు ఎంపికైతే పోస్టులను అనుసరించి నెలకు రూ. 15600 నుంచి 19500 చెల్లిస్తారు.

దరఖాస్తులు విధానం:

ఆఫ్ లైన్

దరఖాస్తులను https://mulugu.telangana.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా – ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య కళాశాల, ములుగు, రూమ్ నెంబర్ 48.

దరఖాస్తులు ప్రారంభం:

17-05-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

22-05-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి