iDreamPost

ESICలో ఉద్యోగాలు.. ఎలాంటి పరీక్ష లేదు.. నెలకు రూ.1.27 లక్షల జీతం!

నిరుద్యోగులకు శుభవార్త. కళ్లు చెదిరే వేతనంతో ఉద్యోగాలు పొందే అవకాశం. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు మీకోసం..

నిరుద్యోగులకు శుభవార్త. కళ్లు చెదిరే వేతనంతో ఉద్యోగాలు పొందే అవకాశం. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు మీకోసం..

ESICలో ఉద్యోగాలు.. ఎలాంటి పరీక్ష లేదు.. నెలకు రూ.1.27 లక్షల జీతం!

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఉన్నాయి. పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలకు ఎంపిక కావొచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈఎస్ఐసీ అధికారిక వెబ్‌సైట్ esic.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారు నేరుగా ఇంటర్య్వూకి హాజరుకావాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ పోస్టులు మొత్తం:

  • 10

విభాగాల వారీగా ఖాలీలు:

స్పెషలిస్ట్ పోస్టులు

  • 04
  • జనరల్ మెడిసిన్ 1,జనరల్ సర్జరీ 1, అనస్థీషియా 1, రేడియాలజీ 1

సీనియర్ రెసిడెంట్ పోస్టులు:

  • 6
  • జనరల్ మెడిసిన్ 2, ఓబీజీ 1,జనరల్ సర్జరీ 1, పీడియాట్రిక్ 1, పాథాలజీ 1.

అర్హత:

  • అభ్యర్థులు గుర్తిపు పొందిన యూనివర్సిటీ నుంచి మెడికల్ పీజీ లేదా పీజీ డిప్లొమా కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • స్పెషలిస్ట్- ఈ పోస్టులకు అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ నాటికి 69 ఏళ్లు మించకూడదు. అలాగే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.
  • సీనియర్ రెసిడెంట్- ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 45 ఏళ్లు మించకూడదు. అంతేకాకుండా, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కూడా ఇవ్వబడుతుంది.

జీతం:

  • స్పెషలిస్ట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 1,27,141 చెల్లిస్తారు.
  • సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 67,700 చెల్లిస్తారు.

ఎంపిక విధానం:

  • వాక్-ఇన్ ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయబడతారు.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్య్లూడీ, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు.

ఇంటర్వ్యూ తేదీ:

  • 22-03-2024

రిపోర్టింగ్ సమయం:

  • 09:00 AM

ఇంటర్వ్యూ వేదిక:

  • మెడికల్ సూపరింటెండెంట్ రూమ్, 2వ అంతస్తు, ఈఎస్ఐసీ మోడల్ హాస్పిటల్, సెక్టార్ 9ఏ, గురుగ్రామ్, హర్యానా-122001

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి