iDreamPost

హైదారాబాద్‌లోని ESIC లో ఉద్యోగాలు.. అర్హతలు ఏంటంటే?

ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి శుభవార్త. హైదరాబాద్ లోని ఈఎస్ఐసీ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. భారీ వేతనంతో కూడిన ఈ ద్యోగాలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి శుభవార్త. హైదరాబాద్ లోని ఈఎస్ఐసీ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. భారీ వేతనంతో కూడిన ఈ ద్యోగాలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

హైదారాబాద్‌లోని ESIC లో ఉద్యోగాలు.. అర్హతలు ఏంటంటే?

నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్. భారీ వేతనంతో హైదరాబాద్ లోని ఈఎస్ఐసీ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కాంట్రాక్టు ప్రాతిపదికన ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్/ట్యూటర్ & స్పెషలిస్ట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 146 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి డిగ్రీ, ఎంబీబీఎస్, నిబంధనల ప్రకారం ఇతర అర్హతలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జనవరి 29 నుంచి ఫిభ్రవరి 8 వరకు ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈఎస్ఐసీ అధికారిక వెబ్ సైట్ ను https://esic.gov.in/ పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమచారం:

మొత్తం ఖాళీల సంఖ్య:

  • 146

విభాగాల వారీగా ఖాళీలు:

  • ఫ్యాకల్టీ- 55
  • సూపర్ స్పెషలిస్ట్-05
  • స్పెషలిస్ట్- 02
  • సీనియర్ రెసిడెంట్-78
  • ట్యూటర్లు- 06

అర్హత:

  • పోస్టులను బట్టి ఎంబీబీఎస్, డిగ్రీ, ఇంకా ఇతర అర్హతలు కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు పోస్టులను అనుసరించి కనీస వయోపరిమితి 37 సంవత్సరాలు, గరిష్ట వయసు 74 సంవత్సరాలు కలిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మహిళ/ఎక్స్ – సర్వీస్‌మెన్ & దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ:

  • వాక్ ఇన్ ఇంటర్య్వూ ద్వారా ఎంపిక చేస్తారు.

జీతం:

  • పోస్టులను బట్టి కనీస వేతనం రూ. 67700, గరిష్ట వేతనం రూ. 239607 గా చెల్లిస్తారు.

ఇంటర్వ్యూ తేదీలు:

  • 29-01-2024 నుంచి 08-02-2024 తేదీల్లో హాజరు కావాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూలు నిర్వహించు వేదిక:

  • ఇంటర్వ్యూలను హైదరాబాద్ సనత్ నగర్ ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలోని అకడమిక్‌ బ్లాక్ లో నిర్వహించనున్నారు

ఈఎస్ఐసీ అధికారిక వెబ్ సైట్:

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి