iDreamPost
android-app
ios-app

నవోదయ విద్యాలయాల్లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. నెలకు 44,900 జీతం

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే రాత పరీక్ష లేకుండానే జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 44900 జీతం అందుకోవచ్చు.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే రాత పరీక్ష లేకుండానే జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 44900 జీతం అందుకోవచ్చు.

నవోదయ విద్యాలయాల్లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. నెలకు 44,900 జీతం

ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. చిన్న జాబ్ అయినా సరే గవర్నమెంట్ అయితే చాలు అనుకుంటున్నారు యూత్. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే పోటీ పరీక్షలను ఎదుర్కోవాలి. పరీక్షల్లో ప్రతిభ కనబర్చాలి. ఆ తర్వాత ఇంటర్వ్యూలు వీటన్నింటిని దాటితేనే ఉద్యోగం వరిస్తుంది. అయితే మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నట్లైతే గుడ్ న్యూస్. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. ఎగ్జామ్ నిర్వహించకుండానే ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 44,900 జీతం అందుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వం ఆద్వార్యంలో పనిచేస్తున్న నవోదయ విద్యాలయాల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. హైదరాబాదులోని నవోదయ విద్యాలయ సమితి ప్రాంతీయ కార్యాలయం 2024- 25 అకాడమిక్ సెషన్ కి సంబంధించి హైదరాబాద్ రీజియన్ లోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన కౌన్సిలర్ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నది. ఈ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు మాస్టర్ డిగ్రీ( ఎంఏ/ ఎంఎస్సీ) గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ లో డిప్లొమా కోర్స్ తో పాటు ఏడాది పని అనుభవం కలిగి ఉండాలి. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

పోస్టులు:

  • కౌన్సిలర్

అర్హత:

అభ్యర్థులు సైకాలజీలో మాస్టర్ డిగ్రీ( ఎంఏ/ ఎంఎస్సీ) గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ లో డిప్లొమా కోర్స్ తో పాటు ఏడాది పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి:

28 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అర్హులు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 44900 జీతం అదిస్తారు.

ఎంపిక ప్రక్రియ:

విద్యార్హతలో సాధించిన మార్కుల , ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ :

31-05-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి