iDreamPost
android-app
ios-app

Apple: యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన యాపిల్‌.. ఇక ఫ్రీగా ఆ సేవలు

  • Published Jun 11, 2024 | 12:59 PMUpdated Jun 11, 2024 | 12:59 PM

యాపిల్‌ తన యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తమ కస్టమర్ల కోసం ఆ సేవలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలు..

యాపిల్‌ తన యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తమ కస్టమర్ల కోసం ఆ సేవలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలు..

  • Published Jun 11, 2024 | 12:59 PMUpdated Jun 11, 2024 | 12:59 PM
Apple: యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన యాపిల్‌.. ఇక ఫ్రీగా ఆ సేవలు

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఏఐ.. విస్తరణ చాలా వేగంగా ఉంది. దీని వల్ల టెక్‌ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయని.. ఈ ఫీచర్స్‌ గురించి తెలుసుకోకపోతే ఉద్యోగులు చాలా నష్టపోతారని.. దీని వల్ల టెక్‌ రంగంలో ఉద్యోగ సంక్షోభం నెలకొనవచ్చనే ఊహగానాలు గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక కంపెనీలు తమ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల్లో ఏఐ చాట్‌జీపీటీ ఫీచర్లను అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి యాపిల్‌ కూడా చేరింది. ఈ క్రమంలో ఐఫోన్ యూజర్లకు ఆపిల్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో తీసుకురానున్న ఐఓఎస్‌ 18లో ఏఐ ఆధారిత ఫీచర్లను తీసుకువచ్చేందుకు రెడీ అయ్యింది. అది కూడా ఉచితంగా. ఆ వివరాలు..

ఐఫోన్లు, యాపిల్ వాచ్, ఐప్యాడ్ వంటి అన్ని యాపిల్ ఉత్పత్తుల్లో ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.  స్మార్ట్ సిరి, చాట్‌ జీపీటీఇంటిగ్రేషన్‌లో భాగంగా.. ఫోటోల కోసం కొత్త ఫీచర్లు, హోమ్ స్క్రీన్, కంట్రోల్ సెంటర్, లాక్ స్క్రీన్, గేమ్ మోడ్, శాటిలైట్ మెసేజింగ్ వంటి ఫీచర్లలో అత్యాధునిక సాంకేతికతను అమలు చేయనున్నట్లు పేర్కొంది. దీనిలో భాగంగా యాపిల్‌ ఐఓఎస్‌ 18, ఐప్యాడ్‌ఓఎస్‌ 18, మ్యాక్‌ఓఎస్‌ సీక్వియా కోసం ఏఐ ఆధారిత ఫీచర్లను తీసుకురానున్నట్లు తెలిపింది.

Apple Users

ఇది సెప్టెంబరులో పబ్లిక్ రోల్‌అవుట్‌తో అందుబాటులో ఉంటుంది. ఇకపై యాపిల్‌ యూజర్లు.. మెయిల్‌లు, సందేశాల కోసం రైటింగ్ టూల్స్, జెన్‌మోజీ, కస్టమ్ ఎమోజీలతో పాటు స్మార్ట్, చాట్‌జిపిటి-4o పవర్డ్ సిరి వంటి ఏఐ ఫీచర్‌లను పొందగలుగుతారు. డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్‌ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. తాము ఒపెన్‌ ఏఐతో జత కట్టబోతున్నట్లు యాపిల్‌ వెల్లడించింది..

ఇకపై కొత్తగా డిజైన్‌ చేయబోతున్న సిరి, రైటింగ్‌ టూల్స్‌ని చాట్‌జీటీతో అనుసంధానించబోతున్నారు. దీని ద్వారా సిరి ఇప్పుడు కథనాలను సంగ్రహిస్తుంది, ఫోటోల నుండి సమాచారాన్ని గ్రహిస్తుంది లేదా జెన్‌ ఏఐని ఉపయోగించి వాటిని సవరించగలుగుతుంది. చాట్‌జీపీటీని యాపిల్‌ రైటింగ్‌ టూల్స్‌తో అనుసంధానించడ వల్ల అది దేని గురించి అయినా కథనాలు రాయడానికి సాయం చేస్తుంది.

అలానే చాట్‌జీపీటీని ఇమేజ్‌ టూల్స్‌తో అనుసంధానించడం వల్ల అది తమ రైటింగ్‌కు తగ్గట్టుగా భిన్న రకాల ఇమేజ్‌లు క్రియేట్‌ చేసుకోగలుగుతారు అని తెలిపింది. చాట్‌జీపీటీ ఇప్పుడు యాపిల్‌ ఐఓఎస్‌ 18, ఐప్యాడ్‌ఓఎస్‌ 18, మ్యాక్‌ఓఎస్‌ సీక్వియాలో అందుబాటులో ఉండనుంది. దీన్ని యూజర్లు పూర్తిగా ఉచితంగా వినియోగించుకోవచ్చు.. సైన్‌అప్‌ చేయాల్సిన పని లేదు. కాకపోతే.. సబ్‌స్క్రైబర్స్‌ అదనపు ఫీచర్లను వినియోగించుకోవడానికి లింక్‌ చేసుకోవాల్సి వస్తుంది.

ఐఓఎస్‌ 18 కొత్త లాక్, హైడ్ అప్లికేషన్ ఆప్షన్‌లతో పాటు ఆర్‌సీఎస్‌ మద్దతును కూడా అందిస్తుంది, అంటే మరింత భద్రత కల్పించనుంది అన్నాట. ఇది మార్చిన కాలిక్యులేటర్ అప్లికేషన్‌లను, అలర్ట్‌ను కూడా పొందుతుంది. ఇది శాటిలైట్ ద్వారా షెడ్యూల్ చేయబడిన సందేశాలు, ఐమెసెజ్‌ని కూడా సంగ్రహిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి