iDreamPost

‘అపరిచితుడు’లోని ఈ పిల్లాడు.. ఆ స్టార్ హీరోకి బామ్మర్ది..!

Aparichitudu Child Artist.. అపరిచితుడు సినిమా చూశారు కదా.. అందులో విక్రమ్ త్రీ డిఫరెంట్స్ షేడ్స్ లో యాక్ట్ చేసి మెప్పించాడు. అందులో చిన్నప్పటి రామంగా నటించిన పిల్లాడు గుర్తున్నాడా..అతడు ఎవరంటే..?

Aparichitudu Child Artist.. అపరిచితుడు సినిమా చూశారు కదా.. అందులో విక్రమ్ త్రీ డిఫరెంట్స్ షేడ్స్ లో యాక్ట్ చేసి మెప్పించాడు. అందులో చిన్నప్పటి రామంగా నటించిన పిల్లాడు గుర్తున్నాడా..అతడు ఎవరంటే..?

‘అపరిచితుడు’లోని ఈ పిల్లాడు.. ఆ స్టార్ హీరోకి బామ్మర్ది..!

ఇండస్ట్రీలో రాక ముందు పెద్ద యాక్సిడెంట్.. వచ్చాక ఎన్నో స్ట్రగుల్స్.. వాటిని తట్టుకుని టాప్ హీరోగా ఎదిగిన నటుడు విక్రమ్. ఈ వర్సటైల్ నటుడి యాక్టింగ్ కెరీర్ చూస్తే.. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. తమిళ్, తెలుగు, మలయాళ ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలు చేసుకుంటూ వెళ్లిపోయాడు. కానీ విక్రమ్ అనే నటుడు ఇండస్ట్రీలో కొన్నాళ్ల నుండి ఉన్నాడురా అనేలా చేసిన చిత్రం సేతు. అక్కడ మంచి హిట్ కొట్టింది. ఈమూవీతోనే అతడికి చియాన్ విక్రమ్ అనే ముద్ర పడింది. జెమిని, సమురాయ్, సామి చిత్రాలు హీరోగా నిలబట్టాయి. కానీ జాతీయ నటుడిగా గుర్తింపు తెచ్చిన మూవీ పితామగన్. ఇందులో అతని యాక్టింగ్ స్కిల్ చూసి బిత్తరపోయారంతా. అతడిని స్టార్ హీరోగా చేసిన చిత్రం..అన్నియన్ తెలుగులో అపరిచితుడుగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

ఇందులో మూడు క్యారెక్టర్స్ వేసి.. క్లాప్స్, విజిల్స్ కొట్టించుకున్నాడు. అతడు అలా మారడానికి కారణం.. చిన్నప్పుడే అతడి సోదరి మరణం. ఆ చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన పిల్లవాడు గుర్తున్నాడా.. తన సోదరి మరణంతో మనస్థాపానికి గురై.. రామం అపరిచితుడిగా మారి.. యుక్త వయస్సు వచ్చాక అన్యాయం, లంచగొండితనానికి పాల్పడుతున్న వారిని రకరకాలుగా చంపేస్తాడు. ఇప్పుడు ఆ పిల్లాడు ఎలా ఉన్నాడో తెలుసా.. అతడు ఓ ప్రముఖ హీరోకి కజిన్ కూడా. ఈ చైల్డ్ ఆర్టిస్టు.. యంగ్ గా మారి.. తాజాగా ఓ చిత్రంతో అలరించాడు కూడా. ఇంతకు అతడు ఎవరంటే.. విరాజ్. ఇప్పుడు అతడి స్క్రీన్ నేమ్ హరి ప్రశాంత్. ఆయన ఫాదర్ హెచ్ ఎన్ సుందర్ డబ్బింగ్ ఆర్టిస్టు. ఇతడు కోలీవుడ్ టాప్ హీరో ఇళయ దళపతి విజయ్ తల్లి శోభన చంద్రశేఖరన్‌కు స్వయంగా సోదరుడు.

విరాజ్ తండ్రి.. విజయ్‌కు స్వయంగా మేనమామ. ఇలా వీరిద్దరూ బావ బామ్మర్ది లెక్క. ఇలా విరాజ్ సినిమాల విషయానికి వస్తే.. ఐదారు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఈ యాక్టర్.. చెన్నై 600028 చిత్రంతో కనిపించాడు. 2016లో దీనికి సీక్వెల్ రాగా, అందులో కూడా హరి క్యారెక్టర్‌లో నటించాడు. తాజాగా మిషన్ చాఫ్టర్ 1 చిత్రంలో థామస్ పాత్రలో మెరిశాడు. సంక్రాంతికి కోలీవుడ్ నాట రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. చాలా రోజుల తర్వాత అమీ జాక్సన్ కూడా వెండితెరపై కనిపించింది. అరుణ్ విజయ్, అమీ, నిమిషా సాజియన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించాడు. రూ. 10 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం.. రూ. 23 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఇటీవల ఓటీటీలోకి రిలీజ్.. మంచి వ్యూస్ రాబట్టుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి