iDreamPost

ఏపీలో మళ్లీ పంచాయతీ ఎన్నికలు

ఏపీలో మళ్లీ పంచాయతీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ పోరు మళ్లీ షురూ కాబోతోంది. గత నెలలో నాలుగు విడతల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయని సర్పంచ్, వార్డు స్థానాలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నిర్ణయించింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 12 సర్పంచ్, రాష్ట్ర వ్యాప్తంగా 725 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది.

ఎన్నికలు నిర్వహించే 12 సర్పంచ్, 725 వార్డులకు ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 7వ తేదీన పరిశీలన, 10వ తేదీన ఉపసంహరణ, అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ప్రచారం అనంతరం 15వ తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నారు. పోలింగ్‌ రోజు ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

గత నెలలో నాలుగు విడతల్లో 13,092 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో వైసీపీ బలపర్చిన అభ్యర్థులు 10,536 పంచాయతీలను గెలుచుకున్నారు. తెలుగుదేశం పార్టీ మద్ధతుదారులు 2,100 పంచాయతీల్లో గెలుపొందారు. బీజేపీ–జనసేన కూటమి అభ్యర్థులు, స్వతంత్రులు 445 పంచాయతీల్లో పాగా వేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి