iDreamPost

లాక్ డౌన్ అమలులో మన రాష్ట్రమే ఫస్ట్ – జాతీయ చానల్ సర్వే

లాక్ డౌన్ అమలులో మన రాష్ట్రమే ఫస్ట్ – జాతీయ చానల్ సర్వే

లాక్ డౌన్ ని అత్యంత క్రమబద్దీకరణ గా అమలు చెసిన రాష్ట్రాల్లో ఆంద్ర ప్రదేశ్కు మొదటి స్థానం దక్కింది. ఈ మేరకు జాతియ చానల్ NDTV ఒక నివేదికను తన చానల్ లో ప్రసారం చెసింది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అత్యంత పతీష్టంగా అమలు చెసి సత్ఫలితాలు పొందిన రాష్ట్రంలో దేశంలోనే ఆంద్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని కితాబు ఇచ్చింది. అలాగే ఆంద్రప్రదేశ్ తో పాటు కేరళ , కర్ణాటక రాష్ట్రాలు మొదటి మూడు స్థానల్లో ఉనట్టు, అత్యంత దయనీయంగా లాక్ డౌన్ అమలు చెసిన ర్రాష్ట్రంగా ప్రధాని మొడి రాష్ట్రమైన గుజరాత్ అని తన నివేదికలో చెప్పుకోచ్చింది. అంద్రప్రదేశ్ రాష్ట్రం దేశంలొనే మొడటి స్థానంలో ఉండటనికి ముఖ్యకారణం రాష్ట్ర ప్రభుత్వం కరొనా కట్టడికి చెపట్టిన చర్యలే అని నివేదికలో పేర్కోంది. 

కరొనా కట్టడికి పక్క రాష్ట్రాల కన్న ఆంద్రప్రద్రశ్ రాష్టం వేగంగా మేరుగైన చర్యలు చెపట్టారనే చెప్పాలి. కరొనా కట్టడికి తోలి వారంలొనే 408 కోట్లు విడుదల చెసిన ప్రభుత్వం కరొనా మహమ్మరి రాష్ట్రం పై పంజా విసరకుండా తగు జాగ్రత్తలను చెపట్టింది. అందులో బాగంగా రాష్ట్రంలో ఫిబ్రవరి 10 తరువాత విదేశాల నుండి వచ్చిన వారిపై నిఘా పెంచింది, వారిని గుర్తించడానికి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్తను అత్యంత సమర్ధవంతగా ఉపయొగించుకుని రాష్ట్రం మొత్తం జల్లెడు పట్టే విధంగా మొత్తం మూడు సార్లు సర్వే నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలో వాలంటీర్ వ్యవస్త అందించిన సేవలు ఒక మైలు రాయిగా చెప్పచ్చు.

ఒకానొక దశలో విదేశాలనుండి వచ్చిన ప్రయాణీకులని గుర్తించడంలో కేంద్రం కన్న రాష్ట్రం మెగుగ్గా పనిచెయడానికి ముఖ్య కారణం వాలంటీర్ వ్యవస్త. మార్చ్ 20 నాటికే కెంద్రం రాష్టానికి విదేశాలనుండి వచ్చినవారు సంఖ్య 6,513 గా తెలిచితే అప్పటికే రాష్ట్రంలో పనిచెస్తున్న వాలంటీర్ వ్యవస్త చెసిన సర్వేలో విదేశాలనుండి రాష్ట్రానికి వచ్చిన వారి సంఖ్య 13,301 గా తెలింది. ఈ వ్యతాసం చూస్తేనే రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్త కరొనా కట్టడికి ఏవిందంగా తోడ్పడిందో అర్ధం చెసుకోవచ్చు.

విదేశాలనుండి వచ్చిన వారిలో దగ్గు జలుబు లాంటి కరోనా లక్షణాలు ఉన్న అనుమానితులను గుర్తించడానికి తక్షణం వైద్యం, సౌకర్యాల పేంపు పై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియొజకవరగంలో 100 నుండి 150 పడకలతో కూడీన ఐసొలేషన్ వార్డూలను ఏర్పాటు చెయడంతో పాటు హోం క్వారంటైన లో ఉన్నవారికి సైతం వైద్య సేవలు అందిచే విదంగా చర్యలు చెపట్టింది. కరొనా సోకి ఐసోలేషన్ వార్డుల్లో ఉన్న ప్రతి 10మంది వ్యక్తుల ఆరొగ్య పరిస్థితిని పర్యవేక్షించడానికి ప్రత్యకంగా ఒక పర్యవేక్షణాధికారిని నియమించింది. రొగులు పెరిగితే వెంటనే తగు వైద్య సాయం అందించేందుకు వీలుగా 450 ప్రయివేటు ఆసుపత్రులను ఏపిడిమిక్ చట్టం ఆదారంగా ప్రభుత్వ ఆదీనంలోకి తెచ్చుకుంది. లాక్ డౌన్ కారణంగా కాలు బయట పెట్టలేక అనారొగ్యంతో బాదపడుతున్న వారికి 14410 నెంబర్ తో టెలీ మెడిసిన్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. అలాగే గ్రామాల్లో పటణాల్లో ప్రారంభించిన పారిశుద్ద్య పనులు పర్యవేక్షించడానికి ప్రత్యకంగా ఒక సెల్ ను ఏర్పాటు చెసి పనులను వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు చెపట్టారు. డిల్లీ ప్రార్ధనలకు వెళ్ళి వచ్చిన వారికి కరొనా వైరస్ సోకి ఒక్కసారికి వ్యాదిగ్రస్తులు రాష్ట్రంలో పెరిగిపొయినా పటిష్ట వ్యుహంతో ప్రభుత్వం ఏదుర్కుంది. ఈ చర్యల ఫలితంగా మూడవ వారంలో నమొదైన పాజిటివ్ కేసుల సంఖ్య కన్నా నాలుగవ వారంలో పాజిటివ్ కేసుల సంఖ్యను తగ్గించగలిగింది.

ఒక పక్క కరొనా కట్టడిని ఏదుర్కుంటూనే ప్రజలు ఇబ్బందికి గురికాకుడదనే ఆలొచనతో నిత్యవసరాల ధరలు పెరగకుండా తగిన చర్యలు తీసుకున్నారు. ఎక్కడైనా ధరలు పెంచి అమ్ముతునట్టు దృష్టికి వస్తే వెంటనే ప్రభుత్వానికి తెలియపర్చవచ్చు అని చెప్పి 1902 టొల్ ఫ్రీ నంబర్ ను ప్రవేశపెట్టారు. నిత్యవసర దుకాణాలు రైతు బజార్ల దగ్గర ప్రజలు సామాజిక దూరం పాటించేలా మార్కింగ్ సిస్టం ని తీసుకువచ్చారు. వాటి తో పాటు పేద కుటుంభానికి కేజీ పప్పు, రేషన్ సరుకులు అందజేశారు. ఆర్ధిక సాయం కింద 1300 కోట్ల రూపాయల కర్చు చెసి కోటి 30లక్షల కుటుంభాలకు వేయి రుపాయులు అందజేశారు. ప్రజలు బయట ఎక్కువ సేపు ఉండకుండా చూసేందుకు ముఖ్య పట్టణల్లో నిత్యవసర సరుకులు సరఫరా కి హోం డెలివరీ పద్దతని అనుసరించారు. అనాద్ధలు, బిచగాళ్ళు కోసం అద్దేకు కళ్యాణ మండపాలు తీసుకుని వారిని తరలించి అక్కడే వారి అవసరాలు తీర్చెలా చర్యలు చెపట్టారు. అలాగే అరటి రైతులను ఆదుకునేందుకు 250 మెట్రిక్ టన్నుల అరటి గెలలను రైతుల నుండి నేరుగా ప్రభుత్వమే కోని రాష్ట్రంలోని రైతుబజారలకు తరలించింది. టమాట రైతులకి ధర దక్కేలా ప్రభుత్వమే అనేకచోట్ల కోనుగోలు చెసి రైతులను ఆదుకుంది. రబీలో పండించిన ధాన్యం కోనుగోలు చెసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 810 కేంద్రాలను ఏర్పాటు చెసింది.

కరొనా కట్టడికి వైద్య పరీక్షల విషయంలో ఒక వ్యుహం ప్రకారం ముందుకువెళ్ళి, రాష్ట్రవ్యాప్తంగా 1.28 కోట్ల నివాసాలను వాలంటీర్ వ్యవస్త ద్వార సర్వ చెసి క్వారంటైన్ లో ఉన్న వారికి మెరుగైన సేవలు అందజేస్తు. ప్రజలకు ఎప్పటికప్పుడు కరొనా మహమ్మారిపై అవగాహన్ కల్పిస్తు, నిత్యవసర వస్తువుల కోరత రాకుండా పఠిష్ట చర్యలు చెపడుతూ అన్ని విధాలుగా ప్రజలకు అండగా ఉనండేలా ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు, ఒకరికి ఒకరు తోడుగా ఉండి ఈ విపత్తుని ఏదుర్కుందాం అని ఇచ్చిన పిలుపు వలనే నేడు రాష్ట్రం ఈ విపత్కత పరిస్థితులలో కూడా దేశంలోనే సత్ఫలితాలు ఇస్తున్న జాబితాలో తొలి వరసలొ వుంది. ఇది కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఏకదాటిపై నిలిచి సాదించిన ఘనత గా చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి