iDreamPost

గుంటూరు మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష విధించిన హైకోర్టు!

AP High Court: చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరిస్తుంటారు. కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఆ నిర్లక్ష్యమే ఓ మున్సిపల్ కమిషనర్ కొంప ముంచింది. కొత్తపేటలో ప్రైవేటు భూమిని ఆక్రమించి, కోర్టు ధిక్కార కేసులో ఓ ప్రభుత్వ అధికారిణికి ఏపీ హైకోర్టు షాకిచ్చింది.

AP High Court: చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరిస్తుంటారు. కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఆ నిర్లక్ష్యమే ఓ మున్సిపల్ కమిషనర్ కొంప ముంచింది. కొత్తపేటలో ప్రైవేటు భూమిని ఆక్రమించి, కోర్టు ధిక్కార కేసులో ఓ ప్రభుత్వ అధికారిణికి ఏపీ హైకోర్టు షాకిచ్చింది.

గుంటూరు మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష విధించిన హైకోర్టు!

ప్రభుత్వ  ఉద్యోగులు అంటే పాలకులకి, ప్రజలకి మధ్య వారధులు. సామాన్యులకు ఏ సమస్య వచ్చినా..దానిని పరిష్కారం చూపించాలి. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరిస్తుంటారు. కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులను సైతం ధిక్కరిస్తుంటారు. అలాంటి నిర్లక్ష్యమే సదరు అధికారులు కొంప ముంచుతుంది. తాజాగా గుంటూరు మున్సిపల్ కమిషనర్ కి కూడా అలాంటి అనుభమే ఎదురైంది. గుంటూరులోని కొత్తపేటలో ప్రైవేటు భూమిని ఆక్రమించి, కోర్టు ధిక్కార కేసులో సదరు కమిషనర్‌కు ఏపీ హైకోర్టు శిక్ష విధించింది. మరి.. పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందా..

గుంటూరు పట్టణంలోని కొత్తపేటలో యడవల్లి వారి సత్రానికి సంబంధించిన 3,300 గజాల స్థలం ఉంది. దానిని 1965లో మున్సిపల్ కార్పొరేషన్ తీసేసుకుంది. ప్రస్తుతం అక్కడ కాసుశాయమ్మ పేరుతో ఓ పాఠశాలను నిర్వహిస్తున్నారు. అయి నాటి నుంచి నేటి వరకూ ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా అక్రమంగా సత్రం ఆస్తిని  వినియోగిస్తున్నారని, ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన కప్పగంతు జానకిరాం అనే వ్యక్తి హైదరాబాద్ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు.జానకీరాం తరఫున ఫణిదత్ చాణక్య వాదనలు వినిపించారు.

సరైన పద్ధతిలో లీజుకు తీసుకోకుండా సత్రం ఆస్తిని ఎవరు స్వాధీనం చేసుకున్నా.. ఆక్రమణదారులే అవుతారని కోర్టుకు తెలిపారు. ఇందుకు ప్రభుత్వ శాఖలు ఏమీ మినహాయింపు కాదని, అనుమతి లేకుండా ఏళ్ల తరబడి యడవల్లి వారి సత్రాన్ని అనుభవించడం చట్ట విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సత్రానికి బకాయి పడిన రూ. 2.70 కోట్లను తక్షణమే చెల్లించి, ఆ సత్రాన్ని ఖాళీ చేయమని ఆదేశించమని హైకోర్టుకు నివేదించారు.

దీనిపై విచారణ జరిపిన హైదరాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో వెంటనే గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ కౌంటర్ దాఖలు చేసింది. సదరు బకాయిలు చెల్లించలేని స్థితిలో జీఎంసీ ఉన్నదని, పేద వారి కోసం ఉచిత పాఠశాల నిర్వహిస్తున్నామని, బకాయిలు రద్దు కోరుతున్నామని  తెలిపింది. అయితే హైకోర్టు మాత్రం రూ. 25 లక్షలు చెల్లించాలని, తక్షణమే ప్రతి నెలా ప్రతి చదరపు అడుగుకి రూ.2/- చొప్పున అద్దె చెల్లించాలని జీఎంసీని ఆదేశించింది.

హైకోర్టు ఉత్తర్వులను ఉద్దేశ పూర్వకంగా అమలు చేయలేదంటూ పిటిషనర్ మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. పిటిషనర్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది.  గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి ఒక నెల రోజులు సాధారణ జైలు శిక్ష, రూ. 2 వేలు జరిమానా విధిస్తూ  కోర్టు తీర్పు ఇచ్చింది.  అంతేకాక 2024 జనవరి 2వ తేదీన హైకోర్టు రిజిస్ట్రారు ఆఫీస్ లో లొంగిపోవాలని ఆదేశించింది. మరి.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి