iDreamPost

APలో వారికి జగన్ సర్కార్ శుభవార్త.. ఒక్కోక్కరి ఖాతాలోకి రూ.11,500

  • Published Mar 12, 2024 | 1:32 PMUpdated Mar 12, 2024 | 1:32 PM

ఏపీలోని కొందరికి జగన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. వారి ఒక్కోక్కరి ఖాతాలో 11,500 రూపాయలు జమ చేయనుంది. ఇంతకు ఈ మొత్తం ఏ పథకానికి సంబంధించినవి అంటే..

ఏపీలోని కొందరికి జగన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. వారి ఒక్కోక్కరి ఖాతాలో 11,500 రూపాయలు జమ చేయనుంది. ఇంతకు ఈ మొత్తం ఏ పథకానికి సంబంధించినవి అంటే..

  • Published Mar 12, 2024 | 1:32 PMUpdated Mar 12, 2024 | 1:32 PM
APలో వారికి జగన్ సర్కార్ శుభవార్త.. ఒక్కోక్కరి ఖాతాలోకి రూ.11,500

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం రకరకాల సంక్షేమ పథకాలను తీసుకువచ్చి.. వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో సంక్షేమ పథకానికి సంబంధించి డబ్బులు రిలీజ్‌ చేసేందుకు రెడీ అయ్యారు. దీని వల్ల అర్హులైన ఒక్కొక్కరి ఖాతాలో 11,500 రూపాయలు జమ కానున్నాయి. ఇంతకు ఇది ఏ పథకానికి సంబంధించిన నిధులు.. ఎప్పుడు జమ చేస్తారు అంటే..

ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు శుభవార్త చెప్పింది. ఓఎన్‌జీసీ పైప్ లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ఓఎన్‌జీసీ ద్వారా.. ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐదో విడతలో భాగంగా.. అర్హులైన ఒక్కొక్కరికి నెలకు రూ. 11,500 చొప్పున 6 నెలలకుగాను రూ.69,000.. మొత్తంగా 23,458 మందికి గాను రూ. 161.86 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేయనున్నారు.

ఈమేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా ఈ మొత్తాన్ని జమ చేస్తారు. ఇప్పుడు అందిస్తున్న రూ.161.86 కోట్ల సాయంతో కలిపి ఇప్పటి వరకు ప్రభుత్వ చొరవతో ఓఎన్‌జీసీ.. జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ఐదు విడతల్లో అందించిన పరిహారం మొత్తం రూ. 647.44 కోట్లుగా ఉంది.

మరోవైపు నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో రూ.289 కోట్లతో నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ ప్రారంభించనున్నారు సీఎం జగన్. దీనివల్ల మొత్తం 25వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ 58 నెలల ప్రాలన కాలంలో సీఎం జగన్‌ సర్కార్‌ మత్స్య రంగానికి వివిధ పథకాల ద్వారా రూ. 4,913 కోట్లు అందజేసినట్లు తెలిపారు. అంతేకాక సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారుల స్థితిగతులను మెరుగుపరిచి, వలసలను అరికట్టే ఉద్దేశంతో రూ. 3,793 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ లాండింగ్ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది వైసీపీ ప్రభుత్వం..

జువ్వలదిన్నె ఫిషింగ్ హార్టర్ ప్రారంభం.. ఇతర ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మత్య్స ఎగుమతులకు మరింత ఊతమిస్తూ ఈ 58 నెలల్లోనే సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో 4 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక ఈ పోర్టుల నిర్మాణంతో పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా ఖర్చుతో ఎగుమతులకు అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి