iDreamPost

జగన్ ప్రభుత్వం భారీ కసరత్తు.. మారనున్న కోస్తాంధ్ర రూపు రేఖలు!

జగన్ ప్రభుత్వం భారీ కసరత్తు.. మారనున్న కోస్తాంధ్ర రూపు రేఖలు!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేశారు. గతంలో ఎన్నడు లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రజల కోసం ప్రవేశ పెట్టారు. ఇలా సంక్షేమ పథకాలతో జగన్ ప్రభుత్వం జనాలకు చేరువైంది. ఇప్పుడు అభివృద్ధి మీద, ఆదాయ వనరుల మీద జగన్ సర్కారు ఫోకస్ పెట్టింది. ఏపీ పర్యాటకానికి అనుకూలమైన ప్రాంతమని అందరికి తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని జగన్ ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రా ప్రాంతాన్ని టూరిస్ట్ సెంటర్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర రేఖ పొడవు 974 కిలోమీటర్ల  ఉంది. అలానే ఇక్కడ 12జిల్లాలకు సముద్ర తీరం ఉంది. ఆ జిల్లాలోని బీచ్ లను గుర్తించి అభివృద్ధి కోసం కోస్టల్ జోన్ టూరిజం మాస్టర్ ప్లాన్ (సీజెడ్‌టీఎంపీ)ని తీసుకురానుంది. పర్యాటక, మత్స్యకార శాఖలు, ఫిషరీస్ యూనివర్సిటీకి చెందిన అధికారులు ఉమ్మడిగా బీచ్‌లుగా అభివృద్ధి చేయడానికి అనుకూలమైన ప్రదేశాలను గుర్తిస్తున్నారు. ఈ బృందం ఇప్పటికే 289 బీచ్ లను గుర్తించి.. జిల్లా కలెక్టర్లకు రిపోర్టు పంపించారు. ఈ బీచ్‌ల ఆలోచన విజయవతమైతే.. 51 వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త బీచ్‌ల ద్వారా శ్రీకాకుళం జిల్లాకే పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది. ఇక్కడే అత్యధికంగా 60 బీచ్ లను అధికారులు గుర్తించారు.  ఆతరువాత నెల్లూరులో 40, బాపట్లలో 28, విశాఖపట్నంలో 24 చోట్ల బీచ్‌‌లను ఏర్పాటు చేసే వీలుందని అధికారులు అంటున్నారు.

బీచ్‌ల ఏర్పాటు వ్యవహారం భారీ ఖర్చుతో కూడుకుంది కావడంతో.. రిసార్ట్‌లు, రీక్రియేషన్ సదుపాయాలతో బీచ్‌లను అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం ప్రయివేట్ వ్యక్తులను సంప్రదించనుంది. ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రాజెక్ట పనులను వేగవంతం చేస్తోంది. ప్రపంచ పెట్టుబడి సదస్సులో భాగంగా పర్యాటక ప్రాజెక్టుల పెట్టుబడులపై ప్రయివేట్ వ్యక్తులతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది. టూరిజం ప్రాజెక్టులకు రూ.20 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే కార్యరూపం దాల్చిస్తే.. టూరిజంలో గోవాతో ఏపీ పోటీ పడనుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.  మరి.. కోస్తా ప్రాంతంలో పర్యాటక అభివృద్ధిపై జగన్ సర్కార్ దృష్టి పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి