iDreamPost

Breaking : ఏపీ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ అరెస్ట్‌

Breaking : ఏపీ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ అరెస్ట్‌

ఇటీవల ఏపీలో 10వ తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు ఇప్పటికే విచారణ కూడా చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో నారాయణ స్కూల్‌ నుంచి టెన్త్‌ పేపర్లు లీక్ అయ్యాయి అని తెలియడంతో ఈ కేసులో ఇప్పటికే ఆ స్కూల్ వైస్‌ ప్రిన్సిపల్‌ గిరిధర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. దీంతో గత నాలుగు రోజులుగా ఏపీ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ అజ్ఞాతంలో ఉన్నారు.

తాజాగా ఆయనని కొండాపూర్‌లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలో టెన్త్‌ ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహారంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. నారాయణని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనని హైదరాబాద్ కొండాపూర్ నుండి గుంటూరుకు తరలిస్తున్నారు. పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజ్‌ కేసులో నారాయణ విద్యాసంస్థలపై చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కృష్ణాజిల్లాలో కేసులు నమోదు అయ్యాయి. దీంతో నారాయణని మాల్‌ ప్రాక్టీస్‌ నిరోదక చట్టం 408 ఐపిసి కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి