iDreamPost
android-app
ios-app

విద్యాశాఖపై సీఎం జగన్‌ కీలక సమీక్ష..

విద్యాశాఖపై సీఎం జగన్‌ కీలక సమీక్ష..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రతి విద్యార్థికి చదువు నిజమైన ఆస్తి అని నమ్మిన వ్యక్తి సీఎం జగన్. అందుకు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యాను అందించాలని సీఎం జగన్ గట్టిగా సంకల్పించారు. అందుకే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఇక తరచూ విద్యాశాఖపై సమీక్షలు సీఎం నిర్వహిస్తుంటారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థలో మెరుగైన ప్రమాణాలను పాటించడంతో పాటు అద్భుతమైన ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని , అందుకోసం ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్సీని విస్తృతస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం జగన్.. విద్యాశాఖ ఆదేశించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్‌ విద్యలో ఐబీ సిలబస్‌పై సమావేశంలో చర్చించారు. ఈ లక్ష్యం దిశగా అడుగులు వేయాలని అధికారులను సీఎం అదేశించారు. ప్రపంచస్థాయిలో విద్యాబోధనే లక్ష్యంగా అడుగులు వేయాలని, అలానే కసరత్తు చేయాలని సీఎం జగన్ తెలిపారు. ఉన్నత విద్య టీచింగ్, లెర్నింగ్‌లో ఏఐ వినియోగంపై కార్యాచరణకు సీఎంకు జగన్ కు అధికారులు వివరించారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు కోర్సు చివరభాగంలో ఏఐలో ప్రాథమిక అంశాలపై బోధించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. బోధన, పరిశోధన, అసస్మెంట్‌ల్లో ఏఐ టూల్స్‌ వినియోగంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐని ఒక కోర్సుగా ప్రమోట్‌ చేస్తామని వారు పేర్కొన్నారు.

ఏపీ ఉన్నత విద్యా విభాగంలో మొత్తం 1,17,012 మంది మూక్‌ కోర్సుల్లో అభ్యసించారని వెల్లడించారు. 1.5 లక్షల కోర్సులను విద్యార్థులు నేర్చుకున్నారని, తద్వారా 5.09 లక్షల క్రెడిట్స్‌ సాధించారని  అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ..” ఏఐలో మరిన్ని అంశాలను నేర్చుకునేందుకు వీలుగా ఇంటర్నేషనల్‌ అకడమిక్‌ కమ్యూనిటీలో ప్రసిద్ధ సంస్థలను భాగస్వామ్యం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. పైలట్‌ పద్ధతిలో వివిధ సంస్థల కోర్సులను అందుబాటులోకి తేవాలి. పాఠశాల విద్యలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో మెరుగైన విద్యా విధానాలు అందాలి. ఏపీలో ఒక విద్యార్థి సర్టిఫికెట్‌ తీసుకున్నా వాటికి ప్రపంచంలో ఎక్కడైనా.. విలువైనదిగా ఉండాలన్నదే మన లక్ష్యం. విద్యార్ధులతో పాటు తల్లిదండ్రులకూ విద్యావిధానంలో వస్తున్న మార్పులపై అవగాహన కల్గించాలి ” అని సీఎం జగన్ తెలిపారు.

ఇదీ చదవండి: APహైకోర్టు న్యాయవాదిగా బొత్స సతీమణి..