iDreamPost

నారా లోకేశ్ కు నోటీసులు ఇచ్చిన CID అధికారులు!

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శికి, మాజీ మంత్రి నారా లోకేశ్ కి ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. గతంలో ఆయనకు వివిధ కేసుల్లో కూడా సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. తాజాగా మరో అంశంలో ఈ నోటీసులు ఇచ్చారు.

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శికి, మాజీ మంత్రి నారా లోకేశ్ కి ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. గతంలో ఆయనకు వివిధ కేసుల్లో కూడా సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. తాజాగా మరో అంశంలో ఈ నోటీసులు ఇచ్చారు.

నారా లోకేశ్ కు నోటీసులు ఇచ్చిన CID అధికారులు!

టీడీపీ  జాతీయ ప్రధానకార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ కు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. రెడ్ బుక్ పేరుతో నారా లోకేశ్ బెదిరిస్తున్నారంటూ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టుకు ఆశ్రయించారు. ఇక కోర్టు ఆదేశాలతో రెడ్ బుక్ అంశంపై  నారా లోకేశ్ కు ఏపీ  సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.  గురువారం నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లగా లోకేశ్ తీసుకోలేదు. నేరుగా నోటీసులు తీసుకోకపోవడంతో శుక్రవారం వాట్సాప్ ద్వారా లోకేశ్ కు నోటీసులు పంపారు. నోటీసు అందుకున్నట్లు వాట్సాప్ లో లోకేశ్ సమాధానం ఇచ్చారు.

ఇటీవలే నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. అనుకున్న షెడ్యూలు ప్రకారం.. కాకుండా కాస్తా ముందుగానే పాదయాత్రకు ముగింపు పలికారు.. నారా లోకేశ్. ఇక యువగళం యాత్రలో లోకేశ్ ఎక్కువ చెప్పిన మాట.. రెడ్ బుక్ లో రాసుకుంటున్నాను. వైకాపా నేతలను ఎవర్నీ వదలను అంటూ పాదయాత్ర చేసిన ప్రతి చోట ఇదే అంశాన్ని ప్రస్తావించాడు. ఇటీవలే లోకేశ్ యువగళం యాత్ర ముగిసిన సంగతి తెలిసిందే. కుప్పంలో ప్రారంభమైన లోకేశ్ యాత్ర.. విజయనగరంలో జిల్లా వద్ద ముగించారు.

ఇక ఆయన పాదయాత్ర చేసిన నియోజవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశాడు. తాను రెడ్ బుక్ లో రాసుకుంటున్నానని, అధికారంలోకి వస్తే.. ఎవరిని వదలబోమని బెదిరింపులకు పాల్పడ్డాడు. అలానే ప్రభుత్వ అధికారలపై కూడా లోకేశ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమపై కేసులు పెట్టిన, తమ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్క అధికారిని వదలిపెట్టమని, అందరిని జైలుకు పంపిస్తామంటూ పదేపదే హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో అదే రెడ్ బుక్ అంశంపై లోకేశ్ కు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

రెండు రోజుల క్రితం రెడ్ బుక్ పేరుతో నారా లోకేశ్ బెదిరిస్తున్నారంటూ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ  సీఐడీ వాదనలు విన్న కోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన సూచనల మేరకు సీఐడీ..గురువారం లోకేశ్ ఇంటికి వెళ్లారు. అయితే నేరుగా నోటీసులను నేరుగా తీసుకునేందుకు లోకేశ్ నిరాకరించాడని సమాచారం. దీంతో శుక్రవారం నోటీసులను వాట్సాప్  ద్వారా లోకేశ్ కి సీఐడీ అధికారులు పంపారు. నోటీసులు అందుకున్నట్లు లోకేశ్ కూడా సమాధానం ఇచ్చారు. ఇక ఈ కేసుపై విచారణను ఏసీబీ కోర్టు జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది. మరి… ఈ ఇష్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి