iDreamPost

చంద్రబాబు అరెస్ట్‌.. అల్లర్లకు టీడీపీ కుట్ర! అచ్చెన్నాయుడు ఆడియో లీక్‌..!

చంద్రబాబు అరెస్ట్‌.. అల్లర్లకు టీడీపీ కుట్ర! అచ్చెన్నాయుడు ఆడియో లీక్‌..!

టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆడియో లీక్ ల వ్యవహారంతో తరచూ వార్తల్లో ఉంటారు. గతంలో లోకేశ్ పాదయాత్రకు సంబంధించి.. అచ్చెన్నాయుడి ఆడియో లీక్ తీవ్ర‌ దుమారం రేపింది. లోకేశ్ పాదయాత్రపై అచ్చెన్నాయుడి ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. సదరు ఆడియోలో నారా లోకేష్ పాదయాత్రకు కనీస స్పందన లేకపోవడంపై అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. అలానే మరో సందర్భంలో పార్టీ లేదు బొక్క లేదు అంటూ  ఆయనకు సంబంధించిన మరో ఆడియో కూడా లీకైన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో అచ్చెన్నాయుడు.. ఆత్మరక్షణలో పడ్డారని కూడా పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే తాజాగా చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా కూడా అచ్చెన్నాయుడు మరోసారి వార్తలో నిలిచారు. చంద్రబాబు అరెస్ట్ కు సంబంధించి అచ్చెన్నాయుడి ఆడియో తీవ్ర దుమారం రేపుతోంది. సదరు ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడని సీఐడీ అధికారులు అరెస్టె చేశారు. నంద్యాల పర్యటనలో ఉన్న ఆయనని  శనివారం ఉదయం సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి.. విజయవాడకు తరలించారు. అదే రోజు సాయంత్ర 5 గంటలకు తాడేపల్లిలోని సిట్ కార్యాలయంకి తీసుకెళ్లి.. సుదీర్ఘ సమయం పాటు విచారించారు. ఇదే సమయంలో  రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయని అందరు భావించారు. ముఖ్యంగా టీడీపీ ముఖ్యనేతలు చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్రంలో ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతాయని ఆశ పడ్డారని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. అయితే వారు అనుకున్న స్థాయిలో ప్రజల నుంచి స్పందన కరువైంది.

ఈ నేపథ్యంలోనే టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సంబంధించి ఓ ఆడియో  లీకైంది. అచ్చెన్నాయుడు టీడీపీ నేతలతో మాట్లాడిన టెలికాన్ఫరెన్స్ ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు ఆడియోలో కార్యకర్తలు రోడ్ల మీదకు రావడం లేదంటూ అచ్చెన్నాయుడు ఆక్రోశం వ్యక్తం చేశారని తెలుస్తోంది. వెంటనే జన సమీకరణ చేయాలంటూ నాయకులతో అచ్చెన్నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రజలు రోడ్ల మీదకి రావడం లేదని అచ్చెన్నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది.

పెద్ద ఎత్తున కార్యకర్తలను రోడ్డు మీదకి తీసుకురావాలంటూ స్థానిక నేతలను అచ్చెన్నాయుడు ఆదేశించినట్లు  వైరల్ అవుతోంది. అంతేకాక మహిళలను తీసుకొస్తే పోలీసులు అడ్డుకోరంటూ నాయకులకు అచ్చెన్నాయుడు  సలహాలు ఇచ్చారని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టును ప్రజలు పట్టించుకోకపోవడం బాధ కలిస్తోందని ఆయన అన్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే  పలు ఆడియో లీక్ లతో అచ్చెన్నాయుడు వార్తల్లో నిలవగా మరోసారి తెరపైకి వచ్చారు. మరి.. అచ్చెన్నాయుడు ఆడియో అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి