iDreamPost

చంద్రబాబు కస్టడీ పిటిషన్‌లో సంచలన విషయాలు!

చంద్రబాబు కస్టడీ పిటిషన్‌లో సంచలన విషయాలు!

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్‌ స్కాం కేసులో జైలు పాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రిలోని సెంట్రల్‌ జైలులో ఉన్నారు. ఏపీ సీఐడీ కోరిన చంద్రబాబు రెండు రోజుల కస్టడీ నిన్నటితో ముగిసింది. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజులు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్‌ వేసింది. ఆ కస్టడీ పిటిషన్‌లో పలు సంచలన విషయాలను వెల్లడించింది. రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు వ్యవహరించిన తీరును బహిర్గతం చేసింది.

ఏపీ సీఐడీ చంద్రబాబు కస్టడీ పిటిషన్‌లో పేర్కొన్న విషయాలు… చంద్రబాబు నాయుడు తమ విచారణకు సరిగా సహకరించలేదని తెలిపింది. కస్టడీ ఆర్డర్స్ చూపే వరకు సమాధానం చెప్పనని మొండికేశారని, ఆర్డర్ కాపీ ఇచ్చిన తర్వాత తొలి రోజు మ. ఒంటి గంట వరకు దాన్ని చదువుతూ కూర్చున్నారని పేర్కొంది. లంచ్‌ బ్రేక్‌ తర్వాత కూడా అలానే చేశారని అంది. విచారణ రెండు రోజులు ఉందని.. విచారణ అధికారికి సరిగా సహకరించలేదని, ప్రశ్నలు కూడా అడగనివ్వలేదని తెలిపారు.

  ఆయన చెప్పాలనుకున్నదే చెప్పుకుంటూ పోయారని, పొంతన లేని సమాధానాలు చెప్పారని వెల్లడించింది. చంద్రబాబు కావాలనే కాలయాపన చేశారని, మాజీ సీఎం హోదాను అడ్డుపెట్టుకుని అధికారులను దబాయించారని తెలిపింది. నిందితుల స్టేట్‌మెంట్లపై కూడా  ఆయన ప్రశ్నలు అడగనివ్వలేదంది. ఈ కేసులో నిందితులైన ఖన్వేల్కర్‌, లక్ష్మీ నారాయణ, సుబ్బారావు స్టేట్‌మెంట్లపై చంద్రబాబు సమాధానాలను దాట వేశారని పేర్కొంది. బాబు కాలయాపన చేసిన ప్రక్రియనంతా వీడియో రికార్డ్ చేసినట్లు వెల్లడించింది.

15 రోజుల్లోపే కస్టడీ విచారణ ఉంటుందన్న నిబంధనను తనకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారని ఏపీ సీఐడీ తెలిపింది. కేసు నుంచి తప్పించుకునేందుకు విచారణ అడ్డుకున్నారని తెలిపింది. కాగా, చంద్రబాబు ఈ కేసుకు సంబంధించి.. ఏపీ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మరి, చంద్రబాబు కస్టడీలో విచారణకు సహకరించకపోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి