iDreamPost

ఎన్పీఆర్‌పై ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం

ఎన్పీఆర్‌పై ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం

జాతీయ జన గణన(ఎన్పీఆర్‌)పై ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. 2019లో వెల్లడించిన జనగణనలో అనేక సందేహాలున్నాయని, 2010లో అమలు చేసిన ప్రశ్నావళి ఆధారంగా జన గణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసింది. అప్పటి వరకు ఏపీలో జనాభా గణన వాయిదా వేస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. వెలగపూడిలోని సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు.

– అమరావతిలో భూ అక్రమాలపై సమగ్ర విచారణ చేసేందుకు సిట్‌కు పూర్తి అధికారాలు

– పీపీపీ విధానలో భోగాపురం ఎయిర్‌ పోర్టు అభివృద్ధి. జీఎంఆర్‌కు కేటాయింపు.

– పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి ఆమోదం. ఉగాది రోజున 43,141 ఎకరాల భూమిని 25 లక్షల మంది పేరున పట్టాలు పంపిణీ. కాలనీలకు వైఎస్సార్‌ జగనన్నగా నామకరణం. తహసీల్దార్లకు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ హోదా.

– విజయవాడ, కృస్ణపట్నం థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు పూర్తి చేసేందుకు వెయ్యి కోట్లు కేటాయింపు.

– రామాయపట్నం పోర్టు నిర్మాణ అడ్డంకులు తొలగింపు

– ఏపీ సీడ్స్‌కు 500 కోట్ల రూపాయలు కేటాయిపు. వచ్చే ఖరీఫ్‌ నాటికి రైతులకు ఏపీ సీడ్స్‌ ద్వారా విత్తనాలు.

– గత ప్రభుత్వ హయాంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీకి ఇచ్చిన రెండు ఎకరాల కేటాయింపులు రద్దు. సదరు భూమిని సంబంధిత శాఖకు బదిలీ చేస్తూ నిర్ణయం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి