iDreamPost

బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం.. మరికాసేపట్లో ఉభయసభల్లోకి పద్దు..

బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం.. మరికాసేపట్లో ఉభయసభల్లోకి పద్దు..

2022–2023 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. కాసేపటి క్రితం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశం జరిగింది. బడ్జెట్‌కు ఆమోదం తెలిపేందుకే కేబినెట్‌ సమావేశమైంది. కేబినెట్‌ ఆమోదం లభించడంతో.. మరికాసేపట్లో ఉభయ సభల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

శాసన సభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. మండలి డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. వ్యవసాయ బడ్జెట్‌ను శాసన సభలో మంత్రి కురసాల కన్నబాబు, మండలిలో మరో మంత్రి సీదిరి అప్పలరాజులు ప్రవేశపెట్టనున్నారు.

ఏపీ బడ్జెట్‌ దాదాపు 2.56 లక్షల కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉంది. సీఎం జగన్‌ ఇచ్చిన హామీలు అమలు కొనసాగింపే లక్ష్యంగా బడ్జెట్‌లో కేటాయింపులు ఉండనున్నాయి. విద్య, వైద్య, వ్యవసాయం, మహిళా సంక్షేమం కోసం అధిక నిధులు కేటాయించామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి చెప్పారు. నవరత్నల పథకాలకు సరిపడినంత నిధులు కేటాయించామని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి