iDreamPost

టిల్లు స్క్వేర్ పై అనుపమ కామెంట్స్.. రొమాన్స్ చేయడం కష్టం అంటూ..

Anupama Parameswaran: మరో రెండ్రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో టిల్లు హడావుడ్ స్టార్ట్ అయిపోతోంది. ఇప్పటికే డీజే టిల్లుతో కుర్రాళ్లను ఉర్రూతలూగించిన సిద్ధు జొన్నగడ్డ ఇప్పుడు టిల్లు స్క్వేర్ తో మ్యాజిక్ చేయడానికి వస్తున్నాడు.

Anupama Parameswaran: మరో రెండ్రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో టిల్లు హడావుడ్ స్టార్ట్ అయిపోతోంది. ఇప్పటికే డీజే టిల్లుతో కుర్రాళ్లను ఉర్రూతలూగించిన సిద్ధు జొన్నగడ్డ ఇప్పుడు టిల్లు స్క్వేర్ తో మ్యాజిక్ చేయడానికి వస్తున్నాడు.

టిల్లు స్క్వేర్ పై అనుపమ కామెంట్స్.. రొమాన్స్ చేయడం కష్టం అంటూ..

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన టిల్లన్న గురించి ధూంధాం చర్చ నడుస్తోంది. ఒకసారి వచ్చి థియేటర్లలో చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. మరోసారి అలాంటి ఒక రచ్చను చేయడానికి.. ఈసారి డబుల్ ఇంపాక్ట్ తో చేయడానికి టిల్లు స్క్వేర్ తో వస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ నెక్ట్స్ లెవల్లో జరుగుతున్నాయి. ప్రొడ్యూసర్, హీరో, హీరోయిన్ అందరూ వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. అలాగే సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే టిల్లు స్క్వేర్ సినిమాలో ఇంటిమేట్ సీన్స్ కి సంబంధించి తనకు ఎదురైన కష్టాలు, తనకి ఏది ఇబ్బందిగా అనిపించింది అనే విషయాలను అనుపమ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

సాధారణంగా అనుపమ అనగానే మన పక్కింటి అమ్మాయిలా అనిపించేది. చక్కగా లంగాఓణీనో, పంజాబీ డ్రెస్సులోనే, చక్కగా చీరకట్టుకున్నట్లో గుర్తొస్తుంది. కానీ, టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత కచ్చితంగా మోడ్రన్ డ్రెస్సులోనే గుర్తొస్తుంది. అయితే ఇన్నాళ్లు ఇలా హోమ్లీగా కనిపించిన అనుపమ ఎందుకు ఇలా బోల్డ్ క్యారెక్టర్ చేసింది అని అందరూ ప్రశ్నిస్తున్నారు. అందుకు అనుపమ చాలా సింపుల్ గా స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పేసింది. ఇప్పుడు ఎందుకు ఇలాంటి పాత్రలు చేస్తున్నారు అంటే? నటి అన్న తర్వాత అన్నీ పాత్రలు చేయాలి. అందుకే ఇలాంటి పాత్రను ఎంచుకున్నాను అంటూ అనుపమ సమాధానం చెప్పేసింది.

అలాంటి పాత్రలను ఎంచుకున్నంత మాత్రనా సరిపోదు. ఆ పాత్రకు న్యాయం చేయాల్సి ఉంటుంది. అయితే అనుపమ మాత్రం ఆ విషయంలో చాలానే కష్టపడిందంట. అందుకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు బోల్డ్ క్యారెక్టర్, ఇంటిమేట్ సీన్స్ చేయడం ఎంత కష్టం అనే విషయాన్ని అనుపమ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. “నేను ఇన్నాళ్లు గార్ల్ నెక్ట్స్ డోర్ గానే ఉన్నాను. ఈ మూవీలో వేసుకున్న కాస్ట్యూమ్స్ నేను రియల్ లైఫ్ లో కూడా వేసుకోలేదు. ఈ మూవీ చేసిన తర్వాత హాట్ గా కనిపించడం ఎంత కష్టమో నాకు అర్థమైంది. కానీ, మనకి క్యారీ చేయడానికి చాలా కష్టంగా ఉంటాయి. ఈ మూవీలో ఒక శారీ వేసుకున్నప్పుడు చేయి మొత్తం గీరుకుపోయింది. మొత్తం స్క్రాచెస్ పడ్డాయి. ఎవరైతే ఎంతో అందంగా కనిపిస్తూ ఇలాంటి కాస్ట్యూమ్స్ క్యారే చేస్తూ ఉంటారో ఆ హీరోయిన్స్ ని నేను కచ్చితంగా మెచ్చుకుంటాను. అలా కనిపించడం చాలా కష్టం. కొన్ని డ్రస్సెస్ స్క్రీన్ మీద చూడటానికి బాగుంటాయి” అంటూ అనుపమ చెప్పుకొచ్చింది.

అలాగే ఇంటిమేట్ సీన్స్, రొమాన్స్ గురించి కూడా అనుపమ కామెంట్స్ చేసింది. “స్క్రీన్ మీద చూసి రొమాంటిక్ సీన్స్ చాలా ఈజీ అనుకుంటారు. కానీ, వంద మంది క్రూ ముందు హీరోతో రొమాన్స్ చేయడం, అది కూడా చాలా న్యాచురల్ గా ఉండేలా చేయడం చాలా కష్టం. మిగిలిన సీన్స్ కంటే అవే చాలాకష్టం అని నా ఫీలింగ్. ఈ మూవీలో ఇంటిమేట్ సీన్స్ చేయడానికి నేను చాలా కష్ట పడ్డాను. కానీ, ఒక నటిగా అన్ని పాత్రలు చేయాలి కాబట్టి నేను ఈ లిల్లీ క్యారెక్టర్ చేశాను” అంటూ అనుపమ పరమేశ్వరన్ చెప్పుకొచ్చింది. ఇంక ఈ టిల్లు స్క్వేర్ సినిమా మార్చి 29న విడుదల కాబోతోంది. ఈ మూవీపై ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. డీజే టిల్లు కంటే కూడా టిల్లు స్క్వేర్ రెట్టించిన ఫన్ క్రియేట్ చేస్తుందని, ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని చెబుతున్నారు. మరి.. ఇంటిమేట్ సీన్స్ గురించి అనుపమ పరమేశ్వరన్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి