iDreamPost

వరల్డ్ కప్ ఫైనల్.. భారత్ ఓటమిని జీర్ణించుకోలేక మరో యువకుడు మృతి

ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ ఓటమిపాలు కావడంతో తీవ్ర నిరాశతో పాటు విషాదాన్ని మిగిల్చింది. ఓటమిని తట్టుకోలేక క్రికెట్ ఫ్యాన్స్ తనువులు చాలిస్తున్నారు. తాజాగా మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ ఓటమిపాలు కావడంతో తీవ్ర నిరాశతో పాటు విషాదాన్ని మిగిల్చింది. ఓటమిని తట్టుకోలేక క్రికెట్ ఫ్యాన్స్ తనువులు చాలిస్తున్నారు. తాజాగా మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

వరల్డ్ కప్ ఫైనల్.. భారత్ ఓటమిని జీర్ణించుకోలేక మరో యువకుడు మృతి

వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్ కప్ కొట్టి చరిత్ర సృష్టిస్తుందని భావించిన క్రికెట్ ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశ మిగిలింది. ప్రపంచకప్ ప్రారంభం నుంచి అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్స్ కు చేరిన భారత్ పై క్రికెట్ లవర్స్ గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ నిన్న నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తుది పోరులో రోహిత్ సేన ఓటమిపాలైంది. దీంతో ఒక్కసారిగా టీమిండియా అభిమానుల గుండెలు పగిలాయి. కొందరు అభిమానులు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఏపీలో ఓ ఐటీ ఉద్యోగి టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేక గుండెపోటుకు గురై ప్రాణాలొదిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ప్రపంచకప్ లో భారత్ ఓటమి ప్రతి క్రికెట్ అభిమానికి బాధను మిగిల్చింది. నిద్రాహారాలు మాని క్రికెట్ ఫ్యాన్స్ కుంగుబాటుకు లోనవుతున్నారు. తాజాగా వరల్డ్ కప్ ఫైనల్ ల్లో టీమిండియా ఓడిపోయిందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన అసోం-గుహవటిలో చోటుచేసుకుంది. ఐటీఐ విద్యార్థి అయిన ప్రాంజల్ నిన్న రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి మ్యాచ్ వీక్షించాడు. ఈ క్రమంలో భారత్ ఓడిపోవడంతో బాధతో బెడ్రూంలోకి వెళ్లినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఎంతకు బయటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా విగత జీవిగా కనిపించాడు. వెంటనే ఆ యువకుడిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ప్రాంజల్ అప్పటికే మరణించినట్లు వెల్లడించారు. ప్రాంజల్ కు అనారోగ్య సమస్యలు లేవని, భారత్ ఓటమిని తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

కాగా నిన్న భారత్ ఓడిపోయిన క్షణాన ప్రతిఒక్క క్రీడాభిమాని కళ్లు చెమ్మగిల్లాయి. భారత ప్లేయర్స్ గ్రౌండ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న దృష్యాలు ఫ్యాన్స్ ను తీవ్రంగా కలిచివేశాయి. ప్రత్యక్షంగా హాజరైన అభిమానులతో పాటు పరోక్షంగా ఫైనల్ మ్యాచ్ ను వీక్షించిన కోట్లాది మంది భారతీయులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. కాగా వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్‌ను పాట్ కమ్మిన్స్ 240 పరుగులకు ఆలౌట్ చేసి, ఆపై 43 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించారు. ప్రపంచ నంబర్ 1 వన్డే టీమ్ ఇండియాపై విజయాన్ని సాధించడం ద్వారా, ఆస్ట్రేలియా చరిత్రలో ఆరోసారి వన్డే ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి