iDreamPost

హిజ్రాగా మారి వేధిస్తున్న భర్త! ఆ భార్య ఏం చేసిందంటే..

సంసార జీవితంలో గొడవలు అనేవి సర్వసాధారణం. అయితే కొందరు మాత్రం పంతాలకు పోయి.. చిన్న గొడవలను పెద్దవిగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భాగస్వామిని హత్య చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది.

సంసార జీవితంలో గొడవలు అనేవి సర్వసాధారణం. అయితే కొందరు మాత్రం పంతాలకు పోయి.. చిన్న గొడవలను పెద్దవిగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భాగస్వామిని హత్య చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది.

హిజ్రాగా మారి వేధిస్తున్న భర్త! ఆ భార్య ఏం చేసిందంటే..

ఇటీవల కాలంలో కుటుంబాల్లో జరిగే గొడవల కారణంగా జరిగే నేరాలు ఎక్కువయ్యాయి. సంతోషంగా సాగిపోవాల్సిన కుటుంబ బంధాల్లో అనుమానాలు, అపార్ధాలు వంటివి చేరి..జీవితాలను నాశనం చేస్తున్నాయి. వివాహేతర సంబంధాలు, వరకట్న వేధింపులు కారణంగా హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇంకా దారుణం ఏమిటంటే.. భాగస్వామిని హత్య చేసేందుకు సుఫారీలు కూడా ఇస్తున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఓ మహిళ..హిజ్రాగా మారిన తన భర్తను రూ.18 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేసింది. ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

సిద్దిపేట పట్టణంలోని బోయిగల్లీకి చెందిన వేదశ్రీకి నాసర్‌పురా వీధికి చెందిన దరిపల్లి వెంకటేశ్‌తో 2014లో పెళ్లి జరిగింది. వీరికి 2015లో ఓ పాప జన్మించింది. కొంతకాలం వీరి సంసారం చాలా సంతోషంగా సాగింది. అయితే వెంకటేశ్ బుద్ది మారి.. భార్యను వేధించ సాగాడు. అదనపు కట్నం కోసం వేదశ్రీని వేధింపులకు గురి చేశాడు. అంతేకాక  అతని ప్రవర్తనలో కూడా మార్పులు వచ్చాయి. చివరకు హిజ్రాగా మారి వెంకటేశ్ కాస్తా రోజాగా పేరు మార్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే దంపతులు ఏడేళ్లుగా వేరు వేరుగా ఉంటున్నారు.

Harassing husband who became hijra

 కుమార్తె మాత్రం వేదశ్రీ వద్దనే ఉంటుంది. అయితే ఆ పాపను తనకు ఇవ్వాలంటూ వేదశ్రీని వేధించేవాడు. తరచూ ఆమె ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న ప్రైవేటు స్కూల్ వద్దకు వెళ్లి ఇబ్బందులకు గురి చేస్తుండే వాడు. అలానే మరోవైపు, వేదశ్రీ కొంతకాలంగా బోయిని రమేశ్‌తో సన్నిహితంగా ఉంటోంది. తనను ఇబ్బందులకు గురి చేస్తున్న రోజాను అడ్డుగు తొలగించుకోవాలని రమేశ్ తో తెలిపింది. అంతేకాక  రమేశ్ తో కలిసి రోజాను అడ్డు తొలగించుకునేందుకు ఆమె ప్లాన్ రచించింది.

పథకంలో భాగంగా సిద్దిపేటకే చెందిన వ్యాపారి పి.రమేశ్‌తో రూ.18 లక్షలు ఇచ్చేందుకు వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండు విడతలుగా రూ.4.60 లక్షలు ఇచ్చారు. ఇక 2023 డిసెంబరు 11న నాసర్‌పురాలో తన ఇంట్లో  రోజా ఒంటరిగా ఉన్నాడు. అతడికి రమేశ్‌ స్నేహితుడైన నాగరాజుపల్లికి చెందిన ఇప్పల శేఖర్ మద్యం తాగించాడు. రోజా ఫుల్ గా మద్యం తాగిన తరువాత దారుణంగా హత్య చేశారు. మద్యం మత్తులో ఉన్న రోజాపై మరో ఇద్దరు వ్యక్తుల సాయంతో దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.

అప్పట్లో ఈ ఘటనను సిద్ధిపేట వన్‌టౌన్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. రోజా మృతదేహానికి పోస్టుమార్టం చేయగా హత్యగా నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు దర్యాప్తులో చేపట్టి..సాంకేతిక ఆధారాలు సేకరించారు. హత్యలో వేదశ్రీతో పాటు మరో అయిదుగురి పాత్ర ఉందని పోలీసులు తేల్చారు.  నిందితులైన వేదశ్రీ, బోయిని రమేశ్‌, ఇప్పల శేఖర్‌లను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు  గాలిస్తున్నారు. మరి.. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి ఎలాంటి శిక్షలు వేయాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి