iDreamPost

ఇక హెల్త్ ఏటీఎంలు.. పరీక్షలన్నీ ఒకే చోట

ఇక హెల్త్ ఏటీఎంలు.. పరీక్షలన్నీ ఒకే చోట

ప్రస్తుతం జీవన శైలి, ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. పీల్చే గాలి దగ్గర నుండి తినే ఆహారం వరకు అంతా కల్తీతో నిండిపోవడంతో స్వచ్ఛత కొరవడింది. చిరు తిండ్లు, బయట ఫుడ్స్ తింటున్నారు. బలమైన ఆహారాన్ని కూడా శరీరం జీర్ణించుకోలేని స్థితికి చేరిపోయారు నేటి ప్రజలు. దీనికి తోడు హడావుడి జీవనంతో శ్రద్ధ చూపడం లేదు. దీంతో చిన్న వయస్సులోనే అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకు ఉదాహరణ ఇటీవల కాలంలో చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరగడమే. ఇవే కాకుండా బీపీ, షుగర్స్, థైరాయిడ్ వంటి సమస్యలతో పోరాడుతున్నారు. క్యాన్సర్లు కూడా పట్టి పీడిస్తున్నారు. అయితే ఇటీవల జరుగుతున్న ఆరోగ్య పరిణామాల దృష్ట్యా వైద్యులు సైతం.. నిత్యం వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. అయితే ఈ పరీక్షలకు ఎక్కువ సమయం పట్టడంతో అటు వైపు మొగ్గు చూపడం లేదు. అయితే అటువంటి వారికే అందుబాటులోకి వచ్చాయి హెల్త్ ఏటీఎంలు.

హైదరాబాద్‌లో పలు ఆసుపత్రుల్లో ఈ మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మిషన్ల ద్వారా బీపీ, టెంపరేచర్, ఆక్సిజన్ లెవల్స్, బీఎంఐ, ఈసీజీ వంటి వివరాలను నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు. టచ్ స్క్రీన్ కియోస్క్ హార్డ్ వేర్, ఏదైనా ఇంటర్నెట్ కనెక్ట్ చేసిన వెబ్ బ్రౌజర్ నుండి వారి వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. రిపోర్ట్స్ వెంటనే వాట్సాప్, ఈ మెయిల్, ఎస్ఎంఎస్ లేదా ప్రింటవుట్స్‌పై పొందవచ్చు. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ డిజిటల్ హెల్త్ కేర్ కియోస్క్‌ను తీసుకొచ్చింది. ఈ ఏటీఎంల ద్వారా పలు ఆసుపత్రుల్లో రోగుల ఒత్తిడి కూడా తగ్గిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఏఐ, మెషీన్ లెర్నింగ్ సాఫ్ట్ వేర్, సెన్సర్స్ ద్వారా ఇది పనిచేస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి