iDreamPost
android-app
ios-app

పల్లవి ప్రశాంత్ కావాలని మోసం చేశాడు! యాంకర్ శివ ఆవేదన!

పల్లవి ప్రశాంత్ అందరినీ మోసం చేసి బిగ్ బాస్ విన్నర్ అయ్యాడని యాంకర్ శివ అన్నారు. రైతు బిడ్డ అని చెప్పుకునే పల్లవి ప్రశాంత్ నిజ స్వరూపం ఏంటో ఓ వీడియో ద్వారా యాంకర్ శివ వెల్లడించారు.

పల్లవి ప్రశాంత్ అందరినీ మోసం చేసి బిగ్ బాస్ విన్నర్ అయ్యాడని యాంకర్ శివ అన్నారు. రైతు బిడ్డ అని చెప్పుకునే పల్లవి ప్రశాంత్ నిజ స్వరూపం ఏంటో ఓ వీడియో ద్వారా యాంకర్ శివ వెల్లడించారు.

పల్లవి ప్రశాంత్ కావాలని మోసం చేశాడు! యాంకర్ శివ ఆవేదన!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ గా రైతు బిడ్డ కామన్ మ్యాన్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 15 వారాలుగా కొనసాగిన ఈ రియాలిటీ షో ఆదివారం (17-12-2023) నాడు జరిగిన గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. కాగా గ్రాండ్ ఫినాలే సందర్భంగా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, అమర్ దీప్ ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకుని నానా రచ్చ చేశారు. వీరిద్దరి ఫ్యాన్స్ దాడులకు పాల్పడి రణరంగం సష్టించారు. ఈ దాడుల నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ పై యాంకర్ శివ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. పల్లవి ప్రశాంత్ కావాలని మోసం చేసాడని వెల్లడించాడు. తన గెలుపు కారణమైన మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

యాంకర్ శివ పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుతూ.. ప్రీ ప్లాన్డ్ గా బిగ్ బాస్ హౌస్ లోకి పల్లవి ప్రశాంత్ వచ్చాడని అందరినీ మోసం చేసి బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడని అన్నారు. జనాలను మోసం చేసి బిగ్ బాస్ ను మోసం చేసి విజేతగా నిలిచాడని అన్నారు. బిగ్ బాస్ కు ముందే యావర్ ను కలవడం, బిగ్ బాస్ హౌజ్ లో అసలు రంగు బయటపడకుండా పక్కా ప్రణాళికతో గేమ్ ఆడాడని యాంకర్ శివ అన్నారు. హౌస్ లో చేరినప్పటి నుంచే పల్లవి ప్రశాంత్ పై వ్యతిరేకత వచ్చిందని, శివాజీ సపోర్ట్ వల్లే ఫైనల్ వరకు రాగలిగాడని ఆయన అన్నారు. శివాజీ లేకుంటే హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్లతో ప్రశాంత్ అసలు ప్రవర్తన బయటికి వచ్చేదని తెలిపారు. అటు జనాలను మోసం చేసి ఇటు బిగ్ బాస్ ను మోసం చేసి విజేతగా నిలిచాడని యాంకర్ శివ తెలిపారు.

ఇక తన గెలుపులో కీలక పాత్ర పోషించిన మీడియాను దారుణంగా అవమానించాడని యాంకర్ శివ తెలిపారు. పల్లవి ప్రశాంత్ ఇంటర్య్వూ ఇస్తామని చెప్పి తన ఊరికి పలు మీడియాలకు చెందిన యాంకర్లను పిలిపించి కనీస మర్యాద ఇవ్వకుండా అవమానించి మోసం చేశాడని అన్నారు. కేవలం తను ఫేమస్ అయ్యేందుకే ఆలోచించాడే తప్ప ఏవిధమైన హెల్పింగ్ నేచర్ లేదని అన్నారు. 150 కి.మీలు ప్రయాణం చేసి వచ్చిన యాంకర్లకు ఇంటర్య్వూలు ఇవ్వకుండా అమర్యాదగా మాట్లాడి మోసం చేశాడని యాంకర్ శివ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటర్య్వూలు హైదరాబాద్ లో ఇవ్వకుండా తను ఊర్లో పెట్టుకునే సభను హైలెట్ చేసుకునేందుకు మీడియాను వాడుకోవాలని చూశాడని అన్నారు.

పల్లవి ప్రశాంత్ వాళ్లే వస్తారులే ఇప్పుడు అవసరం వాళ్లది, నా ఇంర్య్వూలతో మీడియాకే ఎక్కువ లాభం వస్తదని ఓ మోసపూరిత బుద్దితో ఆలోచించి అవమానించాడని యాంకర్ శివ ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఎముకలు కొరికే చలిలో యాంకర్లను రాత్రిళ్లు వెయిట్ చేయించి ఒక్క బైట్ కూడా ఇవ్వకుండా తన నిజస్వరూపాన్ని బయట పెట్టాడని అన్నారు. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని మద్దతు తెలిపిన మీడియాకు గెలిచిన తర్వాత విస్మరించి తన గర్వాన్ని ప్రదర్శించాడని యాంకర్ శివ తెలిపారు. మరి పల్లవి ప్రశాంత్ మోసం చేశాడని చెప్పిన యాంకర్ శివ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler