iDreamPost

అంబానీ ఇంట పెళ్లి. రూ.1000 కోట్లు ఖర్చు! గెస్ట్ లు మాత్రం టెంట్లలో! కారణం?

Anant-Radhika Merchant’s Pre-Wedding: ప్రపంచం కుబేరుల్లో ఒకరు, భారత దేశంలో అత్యంత సంపన్నులైన ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అతిథులకు ఏర్పాటు చేసిన రాయల్ టెంట్ హౌస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Anant-Radhika Merchant’s Pre-Wedding: ప్రపంచం కుబేరుల్లో ఒకరు, భారత దేశంలో అత్యంత సంపన్నులైన ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అతిథులకు ఏర్పాటు చేసిన రాయల్ టెంట్ హౌస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంబానీ ఇంట పెళ్లి. రూ.1000 కోట్లు ఖర్చు! గెస్ట్ లు మాత్రం టెంట్లలో! కారణం?

రిలయన్స్ గ్రూప్స్ అధినేత ముఖేశ్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలో ఉండే కుబేరుల్లో ఆయన ఒకరు. తన వద్ద ఎంత సంపద ఉన్నా దాన్ని ఇంకాస్త పెంచడం ఆయనకు ఇష్టం. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త ఐడియాలతో ముఖేష్ అంబానీ మార్కెట్ లోకి వస్తుంటారు. మరి.. ఇంతటి సామ్రాజ్యం సృష్టించిన అంబానీ కొడుకు పెళ్లి అంటే ఎలా ఉంటుంది? ఆకాశం అంత పందిరి, భూదేవి అంత అరుగు అనే సామెతలు కూడా సాధారణ మాటలు అయిపోయే రేంజ్ లో ఆ పెళ్లి ఉంటుంది. నిజంగా అదే స్థాయిలో ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడి అనంత్, ఎన్ కోర్ హెల్త్ కేర్ అధినేత వీరెన్ మర్చంట్ కుమార్తె రాధికల వెడ్డింగ్ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. భారీ సంఖ్యలో దేశంలోని ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతున్నారు. అయితే కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్న అంబానీ, అతిథులకు మాత్రం టెంట్లలో ఏర్పాటు చేశారు. మరి.. అందుకు గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రపంచం కుబేరుల్లో ఒకరు, భారత దేశంలో అత్యంత సంపన్నులైన ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి ఎంతో ఘనంగా జరుగుతుంది. ఆకాశానికి పందిరి వేశారా అన్నట్లు అంబాని ఇంట్ల పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుబేరుడు అయినా ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి, రాధిక మర్చంట్ తో వివాహం జరుగుతుంది. ఈ వేడుకను గుజరాత్ లోని జామ్ నగర్ పట్టణంలో నిర్వహిస్తున్నారు. ఇక అనంత్ , రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు  దాదాపు 1000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలానే ఈ వేడుకల్లో పర్ఫామెన్స్ చేయనున్న రిహాన్నాకు ఏకంగా 8 నుంచి 9 బిలియన్ డాలర్లు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అలానే వంటల విషయం గురించి చెప్తే.. దాదాపు 2500 రకాల వంటలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ కార్యక్రమానికి ప్రపంచ నలుమూలల నుంచి సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు హాజరవుతున్నారు. దాదాపు 1000 మందికి పై సెలబ్రీటులు, ప్రముఖులు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో స్టార్ క్రికెటర్స్ , సినీ ప్రముఖులు, వ్యాపార వేత్తలు, రాజకీయ ప్రముకఖులు ఉన్నారు. వీరి కోసం ప్రత్యేక వసతులను ఏర్పాటు చేశారు. రాయల్ టెంట్లను ఏర్పాటు చేసి.. అతిథులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్న అంబానీ అతిథులకు ఏంటి అలా టెంట్లలో అకామిడేషన్ అనే సందేహం చాలా మందికి వ్యక్తమవుతుందిత. అయితే అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by SAINA NEHWAL (@nehwalsaina)

జామ్ నగర్ అనేది  ప్రత్యేకమైనది అయినప్పటికీ చాలా చిన్నపట్టణం. ఇక్కడ ఉన్న ఫైవ్ స్టార్ హోటల్స్, ఇతర హోటల్స్ అంబాని ఇంట జరిగే వేడుకకు వచ్చే అతిథులకు  సరిపోవడం లేదు. పెద్ద సంఖ్యలో అనంత్ అంబానీ, రాధిక ప్రీవెడ్డింగ్ షూట్ కి అతిథులు వస్తున్నారు. వారికి భద్రత విషయంలో, ఇతర వసతుల విషయంలో ముకేశ్ అంబానీ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలుగ కుండా రాయల్ టెంట్లను ఏర్పాటు చేశారు. మొత్తం 55 నుంచి 66 రాయల్ టెంట్స్ ను ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

అంబానీ ఏర్పాటు చేసిన ఇవి పేరుకే టెంట్లు కానీ.. ఫైవ్ స్టార్ హోటల్స్ కి మించి వీటిలో సౌకర్యాలు ఉన్నాయి.  ఈ టెంట్ల లోపల ఉండే ఇంటీరియర్ మొత్తం పెద్ద పెద్ద హోటలను తలదన్నేలా ఉన్నాయి. వచ్చే అతిథుల కోసం భారీ స్థలంలో ఈ ఏర్పాటు చేశారు. మరీ.. అంబానీ అంటే మాములుగా ఉండదు కదా అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ముకేశ్ అంబానీ ఏర్పాటు చేసిన ఈ  రాయల్ టెంట్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Viral Entalks (@viralentalks)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి