iDreamPost

అంబానీ కొడుకు పెళ్లి ఖర్చు రూ.1,000 కోట్లు? ఇది కదా రికార్డు!

  • Published Mar 01, 2024 | 3:24 PMUpdated Mar 01, 2024 | 3:24 PM

అంబానీ ఇంట వేడుక జరిగితే ఎలా ఉంటుందో మరోమారు అందరికీ తెలిసొచ్చింది. డబ్బుల్ని మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్న తీరుకు అందరూ షాకవుతున్నారు.

అంబానీ ఇంట వేడుక జరిగితే ఎలా ఉంటుందో మరోమారు అందరికీ తెలిసొచ్చింది. డబ్బుల్ని మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్న తీరుకు అందరూ షాకవుతున్నారు.

  • Published Mar 01, 2024 | 3:24 PMUpdated Mar 01, 2024 | 3:24 PM
అంబానీ కొడుకు పెళ్లి ఖర్చు రూ.1,000 కోట్లు? ఇది కదా రికార్డు!

పెళ్లి.. జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే వేడుక. లైఫ్​లో ఒక్కసారే జరిగే వివాహాన్ని ఎంతో గ్రాండ్​గా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రతి క్షణాన్ని మెమరబుల్​గా ఉంచుకోవాలని భావిస్తారు. అందుకోసం బంధువులు, సన్నిహితులు, స్నేహితులను పిలుస్తారు. తమకు ఉన్నంతలో వివాహ వేడుకను వైభవంగా జరిపేందుకు ప్లాన్ చేస్తారు. పెళ్లి కోసం సామాన్య ప్రజలు కూడా పెద్ద స్థాయిలో ఖర్చు చేస్తారు. అలాంటిది ఇంక ధనవంతులు ఏ రేంజ్​లో ఖర్చు చేస్తారో ఊహించుకోవచ్చు. అందులోనూ దేశంలోనే మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ఇంట పెళ్లి వేడుక అంటే డబ్బులు ఏ విధంగా ఖర్చు పెట్టేస్తారో ఊహకు కూడా అందదు. ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్​ను పెళ్లాడనున్న విషయం తెలిసిందే. గుజరాత్​లో జరగనున్న ఈ పెళ్లి కోసం ఏకంగా రూ. 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది.

రిలయన్స్ అధినేత, అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి అంటే ఎలా ఉండాలో సెపరేట్​గా చెప్పనక్కర్లేదు. వరల్డ్​లోని సెలబ్రిటీలు అంతా ఆయన ఇంట సందడి చేయాల్సిందే. జీవితాంతం ఎప్పటికీ గుర్తుండిపోయేలా అతిథులకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు ముకేష్ అంబానీ. అందుకోసం ఎంత డబ్బు ఖర్చయినా పర్లేదని మ్యారేజ్ మాత్రం గ్రాండ్​గా ఉండాలని భావిస్తున్నారట. అనంత్-రాధిక పెళ్లి కోసం ఏకంగా రూ.1,000 కోట్లు (120 మిలియన్లు) ఖర్చు చేస్తున్నారని సమాచారం. అయితే ఇన్ని కోట్లు ఖర్చు చేసినా అంబానీకి పోయేదేమీ లేదు. ఎందుకంటే ఆయనకు ఉన్న సంపాదనలో ఇది కేవలం 0.1 శాతం మాత్రమే కావడం గమనార్హం. 113 బిలియన్ల ఆస్తితో భారత్​లోనే మోస్ట్ రిచెస్ట్ పర్సన్​గా ఉన్న ముకేష్.. కొడుకు పెళ్లి కోసం ఏ విషయంలోనూ తగ్గేదేలే అంటున్నారట.

అనంత్ అంబానీ పెళ్లి కోసం ముకేశ్ రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. ఇది కదా అసలైన రికార్డు అంటున్నారు. ఈ ఖర్చుతో వేలాది వివాహాలు చేయొచ్చని చెబుతున్నారు. ఒక మ్యారేజ్​కు దాదాపుగా రూ.10 లక్షలు ఖర్చు పెట్టుకున్నా.. రూ.1,000 కోట్లతో ఏకంగా 10 వేల వివాహాలు చేయొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, గుజరాత్​లోని జామ్​నగర్​లో అనంత్-రాధిక పెళ్లి వేడుక జరగనుంది. ఇవాళ ప్రీ వెడ్డింగ్​ ఈవెంట్​లో పాప్ సింగర్ రిహాన్నా పెర్ఫార్మ్ చేయనున్నారు. తన పెర్ఫార్మెన్స్ కోసం ఆమె ఏకంగా 9 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపుగా రూ.75 కోట్లు) ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘యాన్ ఈవెనింగ్ ఇన్ ఎవర్​ల్యాండ్’ టైటిల్​తో ఈ ప్రోగ్రామ్​ను నిర్వహిస్తున్నారు. మరి.. అనంత్ అంబానీ వెడ్డింగ్​కు ఏకంగా రూ.1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారనే వార్తలపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వినియోగదారులకు షాక్.. పెరిగిన గ్యాస్ ధరలు.. ఎంతంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి