iDreamPost

మనిషి తలపై కొమ్ములు.. డాక్టర్స్ సైతం షాక్ అవుతున్నారు!

  • Published Apr 02, 2024 | 6:03 PMUpdated Apr 02, 2024 | 6:03 PM

సాధారణంగా తలపై కొమ్ములు రావడం, మనుషులు జంతువుల ఆకారంలా కనిపించడం వంటివి ఎక్కువగా ఫిక్షన్ చిత్రల్లో చూస్తుంటాం. ఎందుకంటే.. అక్కడ మనుషులు జంతువుల ఆకారంలో కనిపించడం వంటివి అంతా గ్రాఫిక్ గా చూపిస్తుంటారు. కానీ, ఓ మనిషికి కొమ్ములు రావడం ఎప్పుడైనా.. ఎక్కడనా చూశారా..? తాజాగా అలాంటి వింత ఘటన ఓ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

సాధారణంగా తలపై కొమ్ములు రావడం, మనుషులు జంతువుల ఆకారంలా కనిపించడం వంటివి ఎక్కువగా ఫిక్షన్ చిత్రల్లో చూస్తుంటాం. ఎందుకంటే.. అక్కడ మనుషులు జంతువుల ఆకారంలో కనిపించడం వంటివి అంతా గ్రాఫిక్ గా చూపిస్తుంటారు. కానీ, ఓ మనిషికి కొమ్ములు రావడం ఎప్పుడైనా.. ఎక్కడనా చూశారా..? తాజాగా అలాంటి వింత ఘటన ఓ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

  • Published Apr 02, 2024 | 6:03 PMUpdated Apr 02, 2024 | 6:03 PM
మనిషి తలపై  కొమ్ములు.. డాక్టర్స్ సైతం షాక్ అవుతున్నారు!

సాధారణంగా తలపై కొమ్ములు రావడం, మనుషులు జంతువుల ఆకారంలా కనిపించడం వంటివి ఎక్కువగా హాలీవుడ్ ఫిక్షన్ చిత్రల్లో చూస్తుంటాం. ఎందుకంటే.. అక్కడ మనుషులు జంతువుల ఆకారంలో కనిపించడం వంటివి అంతా గ్రాఫిక్ గా చూపిస్తుంటారు. కానీ, చరిత్రలో కొన్ని చోట్ల ఇలాంటివారు ఉండటం.. అలాంటి వార్తలు వినడం వంటివి చాలా తక్కువగా చూస్తాం. అయితే, ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ఎక్కడ ఏ వింత, విచిత్రమైన మనుషులు, సంఘటనలు చోటు చేసుకున్న క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. ఇక వాటిని విశ్వసించడం కూడా అంత సులభమైన పని కాదు. నిజానికి ఈ కొమ్ముల విషయానికొస్తే.. అవి ఇప్పటి వరకు జంతువులకు ఉంటాయని అందరికి తెలుసు. కానీ ఓ మనిషికి కొమ్ములు రావడం అనేది ఎప్పుడైనా .. ఎక్కడైనా చూశారా.? వినడానికి ఆశ్చర్యకరంగా, నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం ఇంతకి ఈ విచిత్ర ఘటన ఎక్కడ జరిగిందంటే..

అసలు మనిషినేవాడికి జంతువులా కొమ్ములు రావడం ఎప్పుడైనా.. ఎక్కడనా చూశారా..? అది కలలో కూడా జరగదు అని అందరి అభిప్రాయం. కానీ, మధ్యప్రదేశ్ లోని ఓ వ్యక్తికి మాత్రం అచ్చం జంతువుల విచిత్రంగా కొమ్ము పెరుగుతుంది. అసలేం జరిగిదంటే..ఓ వ్యక్తి తలకు గాయమైంది. కొద్ది రోజుల తర్వాత దెబ్బ తగిలిన ప్రాంతంలో కొమ్ము మొలిచింది. అది రోజు రోజుకు పెద్ది కావడంతో ఆ వ్యక్తి వైద్యులను ఆశ్రయించాడు. అయితే ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో చోటుచేసుకుంది. కాగా, రాహ్లీ ప్రాంతానికి చెందిన 74 ఏళ్ల శ్యామ్‌లాల్ యాదవ్‌ అనే వృద్ధుడు కొన్నేళ్ల కిందట ఓ ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. ఇక చికిత్స జరిగిన కొద్ది రోజుల తర్వాత.. దెబ్బ తగిలిన ప్రాంతంలో కొమ్ము పెరగడం మొదలైంది. ఈ క్రమంలోనే.. అతడు ఆ కొమ్మును కత్తిరించుకొనేవాడు. కానీ, అది రోజు రోజుకి ఇంకా పెద్దది కావడంతో శ్యామ్‌లాల్ వైద్యులను సంప్రదించాడు. కాగా, వైద్యులు కూడా ఆయన సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు. దీంతో చివరికి భాగ్యోదయ్ తీర్థ్ ఆసుపత్రిలో ఆ కొమ్మును తొలగించారు.

కాగా, ఈ విషయంపై శ్యామ్ లాల్‌కు వైద్యం చేసిన డాక్టర్ విశాల్ గజభియే మాట్లాడుతూ.. బాధితుడు సేబాషియస్ హార్న్ (కొవ్వు కొమ్ములుగా ఎదగడం) సమస్యతో బాధపడుతున్నాడని తెలిపారు.అయితే అది శరీరంలో సూర్యరశ్మి తగిలే ప్రాంతంలో ఏర్పడతాయని, దీన్ని డెవిల్స్ హార్న్ అని కూడా అంటారని తెలిపారు. ఇక ఎక్స్‌రేలో అతడి కొమ్ము మూలాలు పూర్తిగా శరీరంలోకి చొచ్చుకెళ్లలేదని గుర్తించామని, అందుకే దాన్ని సులభంగా తొలగించామని ఆ వైద్యుడు తెలిపారు. మరి, మనిషికి జంతువుల కొమ్ము పెరగడం వంటి ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి