iDreamPost
android-app
ios-app

భక్తి యాత్రలో అలుపెరగని వృద్ధ దంపతులు

భక్తి యాత్రలో అలుపెరగని వృద్ధ దంపతులు

చాలా మందికి తీర్థయాత్రలు చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే తరచూ దేవాలయాలను దర్శిస్తూ.. భక్తిభావంలో మునిగిపోతుంటారు. అయితే ఎక్కుమంది తమకు అన్ని అనుకూలంగా ఉంటేనే ఆలయాలను సందర్శిస్తుంటారు. అంతేకాక కాలినడకను యాత్రలు సుదీర్ఘ యాత్రలు చేసేందుకు ఆసక్తి చూపించారు. అయితే కొందరు మాత్రం కాలి నడక, సైకిళ్లపై దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. అయితే అందరిని ఆశ్చర్యానికి  గురి చేస్తూ ఓ వృద్ధ దంపతులు కూడా అలాంటి సాహస యాత్ర చేశారు. భక్తిభావంతో అలుపెరగని యాత్ర చేస్తున్నారు ఆ వృద్ధ దంపతులు. మరి.. వాళ్ల స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

గుజరాత్ కు చెందిన ఆర్. ఉపాధ్యాయ(74), సరోజినీ(71) దంపతులు. ప్రస్తుతం ఆమె కాళ్ల వాపు కారణంగా నడవలేని స్థితిలో ఉంది. ఆయన వైద్యుడిగా విధులు నిర్వహించి..ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్నారు. కాళ్ల వాపుతో నడవలేని స్థితిలో తన భార్యను తోపుడు బండిపై కూర్చోబెట్టుకుని వెళ్తున్న ఈ వృద్ధుడి ఆర్‌.ఉపాధ్యాయ తీర్ధయాత్రలు చేస్తున్నారు.  గుజరాత్ లోని ద్వారక నుంచి తమిళనాడు లోని రామేశ్వరం వరకు ఉన్న పుణ్యక్షేత్రాలు చూసేందుకు 2020 ఫిబ్రవరి చివరి వారంలో బయలుదేరారు. వారు చేపట్టిన ఈ ఆధ్యాత్మిక యాత్రను దాతలిచ్చే విరాళాలు, ఆహారం తీసుకుంటూ సాగిస్తున్నారు. ఇటీవలే రామేశ్వరం వరకు వెళ్లి.. గుజరాత్ కి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే శనివారం తిరుమల చేరుకున్న ఈ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలోని అన్నారావు కూడలి నుంచి వెళ్తూ  స్థానికులకు కనిపించారు. వారి గురించి తెలుసుకున్న స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక యాత్రలో అలుపెరగని వృద్ధ దంపతులు అంటూ ప్రశంసిస్తున్నారు. మరి.. ఈ దంపతులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.