iDreamPost

Ayodhya: మోదీకి అరుదైన అవకాశం.. అయోధ్య గర్భగుడిలోకి.. ఇక జన్మ ధన్యం!

  • Published Jan 10, 2024 | 4:48 PMUpdated Jan 10, 2024 | 4:48 PM

కోట్ల మంది కల నెరవేరబోయే సమయం అతి చేరువలో ఉంది. అదే అయోధ్యలో శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవం. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలను మనం నిత్యం వింటూనే ఉన్నాం. ఈ క్రమంలో ప్రాణ ప్రతిష్టకు సంబంధించి మరో వార్త వినిపిస్తోంది.

కోట్ల మంది కల నెరవేరబోయే సమయం అతి చేరువలో ఉంది. అదే అయోధ్యలో శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవం. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలను మనం నిత్యం వింటూనే ఉన్నాం. ఈ క్రమంలో ప్రాణ ప్రతిష్టకు సంబంధించి మరో వార్త వినిపిస్తోంది.

  • Published Jan 10, 2024 | 4:48 PMUpdated Jan 10, 2024 | 4:48 PM
Ayodhya: మోదీకి అరుదైన అవకాశం.. అయోధ్య గర్భగుడిలోకి.. ఇక జన్మ ధన్యం!

రామ జన్మ భూమి అయోధ్యలో ఆ బాల రాముడిని ప్రతిష్టించడానికి.. మరెంతో సమయం లేదు. దీనికి సంబంధించిన పనులు అన్ని శరవేగంగా సాగుతున్నాయి. ప్రతిష్టాపన జరిగేది అయోధ్య లోనే అయినా.. ఆ వేడుకలు మాత్రం దేశమంతటా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అయోధ్య రామ మందిరానికి సంబంధించి నిత్యం ఏవో ఒక వార్తలు వింటూనే ఉన్నాము. ఆ రామయ్య పుణ్యమా అని ఇప్పటి తరం వారు కూడా మన మూలాలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. పైగా, కొన్ని వేల మంది ప్రజలు.. ఆ అట్టహాసపు వేడుకలను చూసినా చాలు తమ జన్మ ధన్యమే.. అనుకుంటున్న క్రమంలో, ప్రధాని నరేంద్ర మోడీ తన చేతుల మీదుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం.. మోడీ అదృష్టం అనుకుంటున్నారు. అయితే, ఇప్పుడు ఈ కార్యక్రమంలోనే మోడీకి మరో అరుదైన అవకాశం లభించింది.

అయోధ్య రామ మందిర గర్భ గుడిలో ప్రతిష్టించబోయే విగ్రహాలను.. ఇప్పటికే సామజిక మాధ్యమాలలో అందరూ వీక్షించారు. అయితే, నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట జరిపించడమే కాకుండా.. ఇప్పుడు వాటిని స్వయంగా మోడీనే గర్భ గుడిలోకి తీసుకుని వస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. పూజా మండపం నుంచి గర్భగుడి లోపలి శ్రీరాముడి విగ్రహాన్ని మోడీ తీసుకురానున్నారు. ఈ మహత్తర ఘట్టం సుమారు 25 సెకన్లలో జరగనుంది. కాగా, ఈ కార్యక్రమం మొత్తం కాశీకి చెందిన పండిట్ లక్ష్మీకాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో జరగనుంది. కాగా, జనవరి 22న జరగబోయే ఈ మహోత్సవం గురించి.. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ఇలా చెప్పారు.

ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22 వ తేదీన ఉదయం 10 గంటలకు.. దేశంలోని అన్ని ఆలయాల్లో భజనలు చేయాలని కోరారు. ఆలయ కమిటీ సభ్యులు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని.. లైవ్ టెలికాస్ట్ చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంతేకాకుండా రాముడి ప్రాణప్రతిష్ఠ పూర్తి అయి హారతి ఇచ్చిన తర్వాత మాత్రమే.. అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని తెలియాజేశారు. అలాగే ఆ రోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ వారి ఇళ్లలో దీపాలను వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. ఇక జనవరి 15 వ తేదీ మకర సంక్రాంతి నుంచి ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22 వ తేదీ వరకు.. అన్ని ఆలయాలను శుభ్రం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్లు ఆయన చెప్పారు.

కాగా, జనవరి 22 వ తేదీన మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ అపూర్వ ఘట్టంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్, ఉత్తర్ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొననున్నారు. సుమారు 4 వేల మంది సాధువులు ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాలు పంచుకోనున్నట్లు అయన తెలిపారు. మరో వైపు ఇప్పటికే అయోధ్యలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీనితో జనవరి 17 వ తేదీన జరగవలసిన శ్రీ రాముని ఊరేగింపును రద్దు చేశారు. ఏదేమైనా, కోట్ల మంది భక్తుల కోరిక త్వరలో నెరవేరబోతోంది. మరి, అయోధ్య రామ మందిర ప్రతిష్ట మహొత్సవం సందర్బంగా వినిపిస్తున్న కథనాలపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియయజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి