iDreamPost

ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ.. బెట్టింగ్ లో రూ. 15 కోట్లు అప్పులు చేసి!

అతడో ప్రభుత్వ ఉద్యోగి.. అతడే కాదూ.. తల్లిదండ్రులు, భార్య కూడా గవర్నమెంట్ ఎంప్లాయిస్. కానీ అతడి దారి పెడదోవ పట్టింది. బెట్టింగ్స్ అలవాటు పడ్డాడు. చివరకు

అతడో ప్రభుత్వ ఉద్యోగి.. అతడే కాదూ.. తల్లిదండ్రులు, భార్య కూడా గవర్నమెంట్ ఎంప్లాయిస్. కానీ అతడి దారి పెడదోవ పట్టింది. బెట్టింగ్స్ అలవాటు పడ్డాడు. చివరకు

ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ.. బెట్టింగ్ లో  రూ. 15 కోట్లు అప్పులు చేసి!

ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రాహుల్. అతడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. భార్య మాత్రమే కాదూ.. తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ ఎంప్లాయిస్సే. మంచి సంపాదన. నలుగురికి తిండి పెట్టే స్థితిలో ఉంది ఆ కుటుంబం. కానీ అంతలో రాహుల్ మెదడులో ఓ పురుగు తొలిగించింది. ప్రభుత్వ ఉద్యోగం ముసుగులో కొంత మందిని చీట్ చేయడం మొదలు పెట్టాడు. అందిన కాడికి డబ్బులు తీసుకున్నాడు. లక్ష, పది లక్షలు కాదూ.. సుమారు 15 కోట్లకు పైగా జనాల సొమ్ము తీసుకుని మోసం చేశాడు. చివరకు బాధితులు తాము మోసపోయామని తెలిసే సరికి లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరకు ఆ మొత్తాన్ని జల్సాలకు ఉపయోగించాడు ఈ అసిస్టెంట్ ఇంజనీర్.

తెలంగాణలోని కీసర మండలం మిషన్ భగీరథలో అసిస్టెంట్ ఇంజనీర్ అయిన రాహుల్.. బెట్టింగ్స్, ఆన్ లైన్ గేమ్స్‌కు అలవాడు పడ్డాడు. ఆన్ లైన్‌లో రమ్మీ, క్రికెట్ బెట్టింగ్స్ కడుతూ డబ్బులు పోగొట్టుకున్నాడు. వాటికి అలవాడు అతడు.. ఇతరులను కూడా మోసం చేయడం మొదలు పెట్టాడు. కాంట్రాక్టర్లకు పనులు ఇప్పిస్తానని చెప్పి సుమారు 37 మంది నుండి రూ. 15 కోట్లకు పైగా డబ్బులు తీసుకున్నాడు. ఎన్ని రోజులైన పనులు ఇప్పించకపోవడంతో.. డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అడగటం స్టార్ట్ చేశారు. అవి కూడా బెట్టింగ్స్ కట్టి పొగొట్టుకున్నాడు రాహుల్. ఇలా చీట్ చేస్తున్నాడని ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆరు నెలల క్రితమే అతడ్ని సస్పెండ్ చేశారు. అతడికి సహకరించిన మరో అధికారిని సైతం విధుల నుండి తొలగించారు హయ్యర్ అఫీషియల్స్.

ఇంతలో అతడు తమను నిండా ముంచాడని తెలుసుకున్న అప్పులు ఇచ్చిన వాళ్లు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కీసర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అతడిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు కేసు నమోదు కావడంతో రాహుల్ పరారీ అయ్యాడు. సోమవారం విదేశాలకు చెక్కేందుకు ప్రయత్నిస్తుండగా.. ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులకు దొరికిపోయాడు. అతడ్ని సోమవారం రాత్రి కీసర పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చి విచారిస్తున్నారు. కాగా, అతడు డబ్బులు ఎగ్గొట్టిన వారంతా రాహుల్ ఇంటికి వెళ్లి ప్రశ్నిస్తుండటంతో.. డబ్బులు తిరిగి ఇస్తామంటూ తల్లిదండ్రులు చెబుతున్నప్పటికీ.. ఎవరికీ నగదు ఇవ్వలేదని తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి