iDreamPost

విరిగిన రైలు పట్టా.. ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

కొన్ని సంఘటనల కారణంగా రైలు ఎక్కాలంటే భయపడే పరిస్థితికి వచ్చేశారు ప్రజలు. ఎప్పుడు ఏ నిమిషంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో రైలు ప్రయాణాన్ని ఆశ్రయించక తప్పడం లేదు.

కొన్ని సంఘటనల కారణంగా రైలు ఎక్కాలంటే భయపడే పరిస్థితికి వచ్చేశారు ప్రజలు. ఎప్పుడు ఏ నిమిషంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో రైలు ప్రయాణాన్ని ఆశ్రయించక తప్పడం లేదు.

విరిగిన రైలు పట్టా.. ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

రైలు ప్రయాణాలంటే ఎవ్వరికి నచ్చదు చెప్పండి. సాఫీగా ప్రయాణం సాగిపోవాలంటే రైలు ప్రయాణాన్ని మించిన మరోటి లేదనేది నిజం. ఇక విండో సీట్ దొరికితే.. కిటికీలో నుండి ప్రకృతి అందాలు పరవశిస్తూ కాలాన్ని కూడా మర్చిపోవచ్చు. అయితే ఇటీవల వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు ఓ పీడకలగా మారుతున్నాయి. రైలు ఎక్కాలన్నా భయం మొదలౌతుంది. ఇక రైలు ఎక్కినప్పుడు ఎక్కడైనా ట్రైన్ చిన్న జర్క్ ఇస్తే.. గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. దిగేంత వరకు ఆందోళనగానే ఉంటుంది. ఒడిశా రైలు ప్రమాద ఘటన చరిత్రలో మిగిల్చిన విషాదాల్లో ఒకటి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో కూడా జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ దుఖ సాగరంలోకి నింపిన సంగతి విదితమే.

ఇవే కాకుండా అడపా దడపా రైల్వే ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. రైలు పట్టాలు తప్పడం, బోగీల్లో మంటలు అలుముకున్న ప్రమాద ఘటనలు జరిగాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో మరో పెను ప్రమాదం తప్పింది. రామేశ్వరం నుండి తిరుపతికి వెళుతోన్న రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌ తృటిలో పెద్ద ప్రమాదం నుండి బయటపడింది. తిరుపతి- కాట్పాడి రైలు మార్గంలో పూతల పట్టు మండలం కొత్తకోట సమీపంలో రైల్వే పట్టా విరిగింది. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది లోకో పైలట్‌కు సమాచారం అందించారు. ఆ లైనులో అప్పుడే తిరుపతికి వెళుతున్న రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌  రైలును లోకో పైలట్ నిలిపివేశారు. రైలు పట్టాలు విరిగిన ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టారు సిబ్బంది.

వెల్డింగ్ పనులు పూర్తవ్వడంతో..లోకో పైలట్‌కు సమాచారం అందించారు. రామేశ్వరం ఎక్స్ ప్రెస్ తిరిగి తిరుపతికి బయలు దేరింది. అయితే ట్రైన్ కాసేపు ఆగిపోవడంతో ఏం జరిగిందో తెలియక అయోమయానికి గురయ్యారు ప్రయాణీకులు. అయితే విషయం తెలిశాక కుదుట పడ్డారు. మరమ్మత్తులు అనంతరం రైలు తిరుపతికి చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే పట్టాలు విరిగిన ఘటన వెనుక కారణాలు తెలియరాలేదు. ఇటీవల తరచుగా ఇటువంటి రైలు ప్రమాద ఘటనలు చోటుచేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి