iDreamPost

అమరావతి భూ కుంభకోణం కేసు : ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్‌ ఆర్డర్‌ను ఎత్తివేసిన సుప్రిం

అమరావతి భూ కుంభకోణం కేసు : ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్‌ ఆర్డర్‌ను ఎత్తివేసిన సుప్రిం

అమరావతి భూ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే అక్కడ భూములు కొనుగోలు చేశారనే అభియోగాలపై చంద్రబాబు ప్రభుత్వంలో అడ్వకేట్‌ జనరల్‌గా పని చేసిన దొమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రిం కోర్టు న్యాయవాది జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఇద్దరు కుమార్తెలు సహా 13మందిపై ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను బయటకు వెళ్లడించవద్దని ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్‌ను సుప్రిం కోర్టు ఎత్తివేసింది.

సెప్టెంబర్‌ 15వ తేదీన ఏపీ హైకోర్టు గ్యాగ్‌ ఆర్డర్‌ను జారీ చేసింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం సుప్రింలో సవాల్‌ చేసింది. ఈ రోజు గంట పాటు ఈ వ్యవహారంపై సుప్రింలో జస్టిస్‌ అశోక్‌భూషన్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు వైపుల వాదనలు విన్న ధర్మాసనం.. హైకోర్టు ఇచ్చిన గ్యాగ్‌ ఆర్డర్‌ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న దొమ్మాలపాటి శ్రీనివాస్‌ సహా 13 మందికి నోటీసులు జారీ చేసింది. నెల రోజుల లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి చివరి వారానికి వాయిదా వేసింది. అప్పటి వరకూ ఈ కేసును ఫైనల్‌ చేయోద్దని ఏపీ హైకోర్టును ఆదేశించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి