iDreamPost

సోషల్ మీడియాలో అమ్మ పాటతో ఊపేస్తున్న ఈ సింగర్ ఎవరో తెలుసా..?

ఇన్ స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే.. ఇటీవల ఓ పాట విపరీతంగా ఆకట్టుకుంటుంది. అదే అమ్మ పాట. ఆమె వాయిస్.. మనస్సుకు హత్తుకుపోయే లిరిక్స్.. పదే పదే పాటను వినేలా చేస్తున్నాయి. ఇంతకు ఆ సింగర్ ఎవరంటే..?

ఇన్ స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే.. ఇటీవల ఓ పాట విపరీతంగా ఆకట్టుకుంటుంది. అదే అమ్మ పాట. ఆమె వాయిస్.. మనస్సుకు హత్తుకుపోయే లిరిక్స్.. పదే పదే పాటను వినేలా చేస్తున్నాయి. ఇంతకు ఆ సింగర్ ఎవరంటే..?

సోషల్ మీడియాలో అమ్మ పాటతో ఊపేస్తున్న ఈ సింగర్ ఎవరో తెలుసా..?

సోషల్ మీడియా చలవ వల్ల అనామకులు సైతం ట్రెండ్ అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది యూట్యూబర్లుగా, ఇన్ స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లుగా రాణిస్తున్నారు. కొత్త కొత్త కంటెట్లు, కాన్సెప్టులతో వీడియోలు చేసి నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు. అలాగే ఒక్క పాటతో కూడా ఫేమస్ అయిపోయిన వాళ్లున్నారు. అక్షరం ముక్క రాని బేబి అనే మహిళ.. ఓ పాటతో ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత పలు సినిమాల్లో, షోల్లో పాడింది. అలాగే బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్న రేను మండల్ అనే మహిళ కూడా ఓ పాటతో ఫేమ్..నేమ్ తెచ్చుకుంది. స్వయంగా హిమేష్ రేష్మియా, సల్మాన్ ఖాన్ వంటి దిగ్గజ నటులు ఆమెను పిలిపించుకుని పాటలు పాడించుకున్నారు. ఇక ఫోక్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్‌తో సత్తా చాటుతున్నారు కొంత మంది.

ఇప్పుడు అటువంటి పాటతోనే సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తుంది ఓ అమ్మాయి. అదే ‘అమ్మ పాట’. ‘అమ్మ పాడే జోల పాట.. అమృతం కన్నా తియ్యనంట. అమ్మ పాడే లాలి పాట..తేనెలోరే పారే యేరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లిసి..నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి..ఉగ్గును పట్టి ఉయ్యాలలూపే అమ్మా లాలన..ఊపిరి పోసే నూరేళ్ల నిండు దీవెన’ అంటూ ఓ పాటతో ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఇన్ స్టాలో ఆ అమ్మాయితో పాటు వాయిస్‌కు కూడా ఫిదా అయిపోతున్నారు. ఏం సాంగ్ రా మైండ్‌లో నుండి పోవడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఆ అమ్మాయి ట్రోల్స్ కు కూడా గురి అవుతుంది. ఆమె పాట కన్నా. .ఆమె వేసుకున్న డ్రెస్ గురించి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు కొంత మంది పనిగట్టుకుని.

ఇంతకు మనస్సుకు హత్తుకునే విధంగా పాట పాడిన ఆ అమ్మాయి ఎవరంటే.. జాహ్నవి ఎర్రం. ఆమె సింగర్.. తన గాత్రంలో సోషల్ మీడియాను ఓలలాడిస్తుంది. మహారాష్ట్రలో పుట్టి పెరిగినట్లు తెలుస్తోంది.  తెలుగు మూలాలున్న అమ్మాయిలా కనిపిస్తుంది.  మిట్టపల్లి స్టూడియో యూట్యూబ్ ఛానల్ కోసం ఈ అమ్మ పాట పాడింది జాహ్నవి. సురేందర్ మిట్టపల్లి రాయగా, సిస్కో డిస్కో సంగీతం అందించాడు. ఈ అమ్మ పాటకు, ఆ లిరిక్స్‌కు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతున్నారు. ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ఇన్ స్టాలో ఈ సాంగ్ ప్రత్యక్షమౌతుంది. ఈ పాట వింటుంటూ వినాలనిపిస్తూనే ఉంది. అంతలా ఆకర్షితులవుతున్నారు. కాగా, ఆమెను ఇన్ స్టాలో 13 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక యూట్యూబ్‌లో కూడా తన పాటలతో అలరిస్తుంది. మీరు ఇప్పటి వరకు వినకుంటే..ఈ పాటను ఓ సారి వినేయండి.

 

View this post on Instagram

 

A post shared by Jgl💫 (@jagityal_folk_adda)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి