iDreamPost

Kavitha: కవిత అరెస్ట్.. హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు

  • Published Mar 16, 2024 | 10:27 AMUpdated Mar 16, 2024 | 10:27 AM

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవిత అరెస్ట్‌పై స్పందిస్తూ.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవిత అరెస్ట్‌పై స్పందిస్తూ.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

  • Published Mar 16, 2024 | 10:27 AMUpdated Mar 16, 2024 | 10:27 AM
Kavitha: కవిత అరెస్ట్.. హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈకేసులో తాజాగా శుక్రవారం నాడు బీఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల కవితను అరెస్ట్‌ చేశారు ఈడీ అధికారులు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో కవితను అదుపులోకి తీసుకున్నారు. మనీలాండరింగ్ కేసు పీఎమ్‌ఎల్‌ఏ యాక్ట్-19 సెక్షన్‌ ప్రకారం కవితను అరెస్టు చేసినట్లు ఈడీ వెల్లడించింది. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు కవిత అరెస్ట్‌ కావడం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కవితను అరెస్ట్‌ చేశారని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూలుకు ఒకరోజు ముందు అరెస్టు చేయటం రాజకీయ లబ్ధి కోసమే అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అంతేకాక బీజేపీ ఎక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించినా.. మోదీ కంటే ముందు ఈడీ వస్తుందని ఎద్దేవా చేశారు. కవిత అరెస్ట్‌తో కాషాయ, కారు పార్టీల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ఈక్రమంలో కవిత అరెస్ట్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

కవిత అరెస్టుపై ఓ జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత అరెస్టు అంశంలో దర్యాప్తు సంస్థల దుర్వినియోగం లేదని అమిత్‌ షా తేల్చి చెప్పారు. లిక్కర్ కేసులో ఎప్పట్నుంచో విచారణ జరుగుతోందని అన్నారు. ఎన్నికల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని కేసుల విచారణ జరగదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి చెబితే దర్యాప్తు సంస్థలు అరెస్టులు చేయవన్నారు. కోర్టు ఆదేశానుసారం దర్యాప్తు సంస్థలు పనిచేస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. దర్యాప్తు సంస్థలు తమకు చెప్పి ఎవరినీ అరెస్టు చేయవని.. వాటి విధులను స్వేచ్ఛగా కొనసాగిస్తాయంటూ అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు.

Amit Shah comments on Kavita's arrest

కాగా, శుక్రవారం సాయంత్రం కవితను అరెస్ట్‌ చేసిన ఈడీ అధికారులు.. ఆమెను ఢిల్లీకి తరలించారు. ఆ తర్వాత శుక్రవారం రాత్రంత ఢిల్లీలోని ఈడీ ఆఫీసులోనే ఉంచారు. నేడు అనగా.. శనివారం ఉదయం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఆమెను హాజరుపర్చనుంది. కవితను విచారించేందుకు గాను ఈడీ కస్టడీ కోరే అవకాశం ఉంది. అమిత్‌ అరోరా స్టే‍ట్‌మెంట్‌ మేరకు కవితను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత శనివారం నాడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఈడీ తనను అరెస్టు చేసిందని కవిత.. సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. కవిత అరెస్ట్‌ నేపథ్యంలో ఆమె అన్న, బీఆర్‌ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఢిల్లీకి చేరుకొని న్యాయవాదులతో మంతనాలు జరుపుతున్నారు. కానీ పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు కవిత అరెస్ట్‌ కావడం సంచలనంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి