iDreamPost

ధోని ఫ్యాన్స్ అంటే నాకూ, జడేజాకి చిరాకు.. సంచలన కామెంట్స్ చేసిన అంబటి రాయుడు!

ధోనిపై ఫ్యాన్స్ చూపించే అభిమానం తనకూ, రవీంద్ర జడేజాకి అస్సలు నచ్చదని షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆ జట్టు మాజీ ప్లేయర్ అంబటి రాయుడు. మరి రాయుడు ఈ సంచలన కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి?

ధోనిపై ఫ్యాన్స్ చూపించే అభిమానం తనకూ, రవీంద్ర జడేజాకి అస్సలు నచ్చదని షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆ జట్టు మాజీ ప్లేయర్ అంబటి రాయుడు. మరి రాయుడు ఈ సంచలన కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి?

ధోని ఫ్యాన్స్ అంటే నాకూ, జడేజాకి చిరాకు.. సంచలన కామెంట్స్ చేసిన అంబటి రాయుడు!

ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్, మహేంద్రసింగ్ ధోనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. చెన్నై మ్యాచ్ ఎక్కడ జరిగినా.. స్టేడియం మెుత్తం పసుపుమయం అవుతుంది. అంతలా చెన్నై ఫ్యాన్స్ ఇతర టీమ్స్ ను  డామినేట్ చేస్తారు. అయితే చెన్నై ఫ్యాన్స్ ను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశాడు ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు. మరీ ముఖ్యంగా ధోనిపై ఫ్యాన్స్ చూపించే అభిమానం తనకూ, రవీంద్ర జడేజాకి అస్సలు నచ్చదని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం రాయుడు చేసిన కామెంట్స్ క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మహేంద్రసింగ్ ధోని.. ప్రపంచ క్రికెట్ లో ఓ లెజెండ్. విజయవంతమైన కెప్టెన్ గా ప్రపంచ క్రికెట్ లో తనకంటూ ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతోపాటుగా వరల్డ్ వైడ్ గా కోట్లలో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ధోని గ్రౌండ్ లోకి వస్తుంటే చాలు.. అతడి పేరుతో నినాదాలు మారుమోగిపోతాయి. చెవులు బద్దలు అయ్యేలా ఆ సౌండ్ ఉంటుంది. అయితే ధోనిపై ఫ్యాన్స్ చూపించే ఈ పిచ్చి అభిమానమే తనకూ, రవీంద్ర జడేజాకు చిరాకు తెప్పించేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు అంబటి రాయుడు.

తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో అంబటి రాయుడు మాట్లాడుతూ..”ధోని తప్ప మిగతా చెన్నై ఆటగాళ్లు సిక్స్, ఫోర్లు కొట్టినా ఫ్యాన్స్ సైలెంట్ గానే ఉంటారు. అదే ధోని గ్రౌండ్ లోకి అడుగుపెడితే చాలు.. చెవులు బద్దలు అయ్యేలా అరుస్తారు. ఇదే నాకూ, రవీంద్ర జడేజాకు చిరాకు తెప్పించే విషయం. సీఎస్కే ఫ్యాన్స్ ముందు చెన్నై అభిమానులు కాదు.. నిజానికి వారందరూ ధోని ఫ్యాన్స్. అందుకే జడ్డూకి చిరాకు వచ్చేది. కానీ అతడు మాత్రం ఏం చేస్తాడు?” అంటూ ఈ షోలో షాకింగ్ విషయాలు వెల్లడించాడు. కాగా.. గతంలో ధోని ముందు బ్యాటింగ్ కు రావాలని రవీంద్ర జడేజాని త్వరగా అవుట్ కావాలని ధోని ఫ్యాన్స్  ఫ్లకార్డులు ప్రదర్శించారు. దీంతో అప్పుడు జడ్డూ తీవ్ర నిరాశకు గురైయ్యాడు. మరి ధోని ఫ్యాన్స్ అంటే తనకూ,  జడేజాకి చిరాకు అని అంబటి రాయుడు సంచలన కామెంట్స్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి