iDreamPost
android-app
ios-app

సెలబ్రేషన్‌, అగ్రెషన్‌తో IPL గెలవలేరు! ఈ సారీ నేరుగా కోహ్లీని టార్గెట్‌ చేసిన రాయుడు!

  • Published May 23, 2024 | 9:41 AM Updated Updated May 23, 2024 | 9:41 AM

RRతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోవడంతో.. అంబటి రాయుడు మరోసారి తన నోటికి పనిచెప్పాడు. ఈసారి ఏకంగా విరాట్ కోహ్లీనే టార్గెట్ గా చేసుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

RRతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోవడంతో.. అంబటి రాయుడు మరోసారి తన నోటికి పనిచెప్పాడు. ఈసారి ఏకంగా విరాట్ కోహ్లీనే టార్గెట్ గా చేసుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

సెలబ్రేషన్‌, అగ్రెషన్‌తో IPL గెలవలేరు! ఈ సారీ నేరుగా కోహ్లీని టార్గెట్‌ చేసిన రాయుడు!

అంబటి రాయుడు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు ప్లే ఆఫ్స్ చేరిన దగ్గర నుంచి ఆ జట్టుపై విమర్శలు చేస్తూనే వస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై డూ ఆర్ డై మ్యాచ్ లో గెలిచింది ఆర్సీబీ. అప్పటి నుంచి ఆ టీమ్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాడు. అయితే రాజస్తాన్ తో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ గెలవాలి అని కోరుకున్న అంబటి రాయుడు ఆ తర్వాత వెంటనే యూటర్న్ తీసుకుని షాకింగ్ కామెంట్స్ చేశాడు. సీఎస్కేను ఓడించినంత మాత్రాన కప్ కొట్టినట్లు కాదు.. అంటూ తన కక్షను మరోసారి వెళ్లగక్కాడు. ఈసారి నేరుగా కోహ్లీనే టార్గెట్ చేశాడు.

టీమిండియా మాజీ క్రికెటర్, సీఎస్కే మాజీ ప్లేయర్ అంబటి రాయుడు ఆర్సీబీపై మాటల యుద్ధం ఆపడం లేదు. చెన్నైపై గెలిచిన తర్వాత ఆర్సీబీ కప్ కొట్టాలని, రేసులో చెన్నై లేదు కాబట్టి ఆర్సీబీ మూడు మ్యాచ్ లు కూడా గెలుస్తుందని రాయుడు ఆర్సీబీని ప్రశంసించినట్లుగానే ప్రశంసించి.. వ్యంగ్యంగా సెటైర్లు వేశాడు. ఇక ఇప్పుడు రాజస్తాన్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోవడంతో డైరెక్ట ఎటాక్ చేశాడు. ఈసారి ఏకంగా విరాట్ కోహ్లీనే టార్గెట్ చేశాడు. ఆర్ఆర్ పై మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అంబటి రాయుడు మాట్లాడుతూ..

“ఐపీఎల్ ట్రోఫీలు ఏ సెలబ్రేషన్స్ కోసమో గెలవరు. అలాగే దూకుడుతో కూడా ట్రోఫీలు గెలుపొందలేరు. కేవలం చెన్నైను ఓడించినంత మాత్రానా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేరు. ప్లే ఆఫ్స్ లో బాగా ఆడితేనే కప్ లు గెలుస్తారు” అంటూ విరాట్ కోహ్లీని టార్గెట్ చేసి విమర్శించాడు. గ్రౌండ్ లో విరాట్ ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో మనందరికి తెలిసిందే. చెన్నైపై విజయం సాధించాక కోహ్లీ చేసుకున్న గెలుపు సంబరాలను దృష్టిలో పెట్టుకునే రాయుడు ఈ కామెంట్స్ చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి రాయుడు నిజంగానే కోహ్లీని టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేశాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.