iDreamPost

సింగిల్‌ పేజీ నుంచి సింగిల్‌ కాలమ్‌ వరకు

సింగిల్‌ పేజీ నుంచి సింగిల్‌ కాలమ్‌ వరకు

ఇప్పుడు బ్యానర్‌ అయినది.. మరికొద్ది నిమిషాలకు లోపలిపేజీకి వెళ్లిపోతుంది.. అనేది పత్రికా రంగంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న మాట. ఇది 100 శాతం వాస్తవం కూడా కాలం గడిచేకొద్దీ పత్రికల్లో వార్తల ప్రాధామ్యాలు మారిపోతూ ఉంటాయి. ఇందుకు ఏ అంశం కూడా మినహాయింపు కాదు. అయితే కొన్ని అంశాలను కావాలని వెలుగులో ఉంచడం కోసం ప్రత్యేకంగా పనిగట్టుకుని కథనాలు ప్రచురించడం ఈ కోవ కిందకు రాదు. అలాంటి అంశమే అమరావతి.

గత ఏడాది డిసెంబర్‌ 18వ తేదీన మొదలైన అమరావతి ఉద్యమం క్షేత్రస్థాయిలో కన్నా పలు పత్రికలు, టీవీ ఛానెళ్లలోనే ఉధృతంగా సాగింది. ప్రత్యేక కథనాలు, ప్రత్యేక షోలతో అమరావతి ఉద్యమాన్ని ఆయా మీడియా యాజమాన్యాలు నడిపించాయి. అమరావతి రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఆరేడు గ్రామాల్లోనే ఉద్యమం సాగింది. ప్రస్తుతం కూడా నడుస్తోంది. ప్రతిపక్ష టీడీపీ శ్రేణలు రాష్ట్రంలో అక్కడక్కడ ఒకట్రెండు సార్లు కార్యక్రమాలు చేయడం తప్పా.. అమరావతి ఉద్యమానికి రాష్ట్ర ప్రజలు మద్ధతు లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

అయితే ఈ క్రమంలో ప్రజల అభీష్టం ఎలా ఉన్నా టీడీపీ అనుకూల మీడియాగా చెప్పబడే పత్రికలు, టీవీ ఛానెళ్లు మాత్రం ఉద్యమాన్ని భారీ స్థాయిలో నడిపించాయి. ఆయా మీడియా సంస్థలు రాసిన కథనాలు.. నిజంగా మూడురాజధానులు ఆగిపోతాయి, ఒకేరాజధానిగా అమరావతి ఉంటుందనే ఆశను ఆయా గ్రామాల్లో నిరసనలు చేస్తున్నవారిలో కలిగించాయంటే అతిశయోక్తి కాదు.

ప్రభుత్వంతో సమాలోచనలు జరిపేందుకు కూడా ఇష్టపడని రీతిలో రైతులను ఆయా మీడియా సంస్థలు ప్రభావితం చేశాయి. దీని వెనుక ఎవరి ప్రయోజనాలు ఎంత మేరకు ఉన్నాయన్న దానిపై తీవ్రచర్చ సాగింది. అయితే నిన్న మొన్నటి వరకు అమరావతి ఉద్యమాన్ని తమ భుజస్కంధాలపై వేసుకున సదరు మీడియా సంస్థలు ఇప్పుడు మొహం చాటేశాయి. ప్రతి రోజూ సింగిల్‌ పేజీని అమరావతి వార్తలు, కథనాల కోసం కేటాయించిన సదరు సంస్థలు ప్రస్తుతం సింగిల్‌ కాలమ్‌ వార్తకు అమరావతి అంశాన్ని పరిమితం చేయడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి