iDreamPost

రైతుల్లో సంతృప్తి.. మందడంలో స్పష్టమైన సంకేతాలు

రైతుల్లో సంతృప్తి.. మందడంలో స్పష్టమైన సంకేతాలు

ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో మందడం, తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో నిన్నటి వరకు నిరసనలు, ఉద్యమాలు జరిగాయి. 29 గ్రామాల్లో కేవలం పైన పేర్కొన్న మూడు గ్రామాల్లోనే ఉదృతంగా ఆందోళనలు జరిగాయి. రాజకీయ పార్టీల నేతలు కూడా ఆయా గ్రామాలకు వెళ్లి రైతులకు సంఘీభావం తెలిపారు.

దాదాపు 33 రోజులుగా మూడు గ్రామాల్లోని రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. అయితే ఇన్ని రోజులు పాటు జరిగిన నిరసనలు నిన్నటి అసెంబ్లీ సమావేశం తర్వాత ఒక్కసారిగా మారిపోయాయి. అమరావతికి భూములిచ్చిన రైతులకు, అక్కడ ఉండే రైతు కూలీలకు ఇప్పటి కన్నా మరింత ఆర్థిక లబ్ధి చేకూర్చేలా వైఎస్‌ జగన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Read Also: మేము చెప్పిందే.. జగన్‌ ప్రభుత్వం చేస్తోంది : బీజేపీ ఎంపీ జీవీఎల్‌

పొలాలు ఇచ్చిన రైతులకు కౌలు పరిహారం పదిహేనేళ్ల పాటు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఏడాది జరీ భూమికి ఐదు వేల రూపాయలు, మెట్టకు మూడు వేల రూపాయల చొప్పున కౌలు పెంచనున్నారు. చివరి ఐదేళ్లు జరీ భూమికి లక్ష రూపాయలు, మెట్ట భూమికి ఏకరానికి 60 వేల రూపాయలు ఇవ్వనున్నారు. భూమి లేని పేదలకు (రైతు కూలీలు) ప్రతి నెలా ఇచ్చే పింఛన్‌ రెట్టింపు చేశారు. ప్రస్తుతం 2500 రూపాయలు ఇస్తుండగా.. దాన్ని 5 వేలకు పెంచారు.

Read Also: అమరావతి – మాణిక్య వరప్రసాద్ రాజీనామా

ప్రభుత్వ నిర్ణయంతో రైతులు సంతృప్తిగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. నిన్నటి వరకు నిరసనలు ఉదృతంగా సాగిన మందడం గ్రామంలోనే రైతులు, రైతు కూలీలు సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. మందడం నుంచి అసెంబ్లీకి వెళ్లే దారిపొడవునా మానవహారంలా నిలబడి.. ‘‘థ్యాంక్యూ సీఎం సర్‌’’ అనే ప్లకార్డులు పట్టుకుని ధన్యవాదాలు తెలుపుతున్నారు. 33 రోజులుగా ఉద్యమం భారీ స్థాయిలో జరిగిన మందడం గ్రామంలోనే ఒక్కసారిగా ప్రభుత్వం పట్ల సానుకూలత రావడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి