iDreamPost
android-app
ios-app

బోయపాటి సినిమాకు బన్నీ కండీషన్లు! ఎందుకంటే?

టాలీవుడ్ లో ఎన్నో వైవిధ్యభరిత, యాక్షన్ తరహా చిత్రాలు అందించిన బోయపాటి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. యాక్షన్ సీన్స్ లో బోయపాటి టేకింగ్ వినూత్నంగా ఉంటుందని ఇండస్ట్రీ టాక్.

టాలీవుడ్ లో ఎన్నో వైవిధ్యభరిత, యాక్షన్ తరహా చిత్రాలు అందించిన బోయపాటి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. యాక్షన్ సీన్స్ లో బోయపాటి టేకింగ్ వినూత్నంగా ఉంటుందని ఇండస్ట్రీ టాక్.

బోయపాటి సినిమాకు బన్నీ కండీషన్లు! ఎందుకంటే?

తెలుగు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లో ఒకరు బోయపాటి శ్రీను. యాక్షన్ భరిత చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ బోయపాటి. గతంలో బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన పుష్ప తో అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. బన్నీ పాన్ ఇండియా హీరోగా ఫుల్ స్ట్రింగ్ లో ఉన్నాడు. ప్రస్తుతం పుష్ప-2 మూవీ షూటింగ్ బిజీలో ఉన్నాడు బన్ని. తాజాగా అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్ లో ఓ మూవీ రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ‘సరైనోడు’ సూపర్ హిట్ అందుకుంది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ రాబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. సరైనోడు లాంటి హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ అనగానే బన్నీ ఫ్యాన్స్ తెగ సంతోషంలో మునిగిపోయారు. ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’తో బన్నీ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ జరుగుతుంది. పుష్ప తర్వాత బన్నీ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మూవీ పూర్తయిన తర్వాత బోయపాటితో నటించే అవకాశం ఉంది.

సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బోయపాటికి బన్నీ కొన్ని కండీషన్లు పెడుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్. దీనికీ ఒక కారణం ఉంది. బాలయ్యతో ‘అఖండ’ లాంటి సెన్సేషన్ హిట్ అందించిన తర్వాత ఇటీవల రామ్ పోతినేని తో ‘స్కంద’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘెర పరాజయం పొందింది. అంతేకాదు ఈ చిత్రంపై సోషల్ మీడియాలో నెగిటీవ్ గా ఎన్నో మీమ్స్ వచ్చాయి. దీంతో బోయపాటి మూవీ అనగానే స్టార్ హీరోలు ఆలోచనలో పడుతున్నారని టాక్. అదే పద్దతిలో బన్నీ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ బోయపాటి మూవీలో నటించాల్సి వస్తే.. స్క్రిప్ట్ వీలైనంత సాలిడ్, లాజికల్, ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉండాలని పలు కండీషన్లు పెట్టినట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని బోయపాటి కొన్ని పాయింట్స్ తో బన్నీకి కథను సిద్దం చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి