iDreamPost

పుష్ప 2 కోసం అమెరికా ట్రిప్

పుష్ప 2 కోసం అమెరికా ట్రిప్

ఈ ఏడాది చివరిలో పుష్ప పార్ట్ 2 ది రైజ్ చూడొచ్చని ఆశపడుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. ఈపాటికి షూటింగ్ మొదలైపోయి ఉంటే డిసెంబర్ రిలీజ్ మీద నమ్మకం పెట్టుకోవచ్చు. కానీ ఇంకా ఫైనల్ స్క్రిప్ట్ నే లాక్ చేయలేదు. ఈ పని మీదే దర్శకుడు సుకుమార్ ప్రత్యేకంగా యుఎస్ వెళ్ళిపోయి అక్కడో రిసార్ట్ లో మొత్తం సెట్ చేస్తున్నారు. ఈ వారంలోగా అవుతుందనుకుంటే మరో పదిహేను రోజులు అదనంగా కావాలని అడిగారట. అప్పటికీ గ్యారెంటీగా చెప్పలేం. పుష్ప 1 ఫలితం చూశాక అందులోనూ నార్త్ ఆడియన్స్ రిసీవ్ చేసుకున్న తీరు సుకుమార్ ని సీక్వెల్ కోసం మరింత కష్టపడేలా ప్రేరేపించింది.

దానికి తోడు కెజిఎఫ్ 2 ప్రభంజనం చూశాక ఉత్తరాది ట్రేడ్ నుంచి పుష్ప 2 కోసం క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ముందు అనుకున్న రేట్ కంటే రెండు మూడింతలు ఎక్కువ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. బిజినెస్ ఫిగర్స్ భారీగా ఉండబోతున్నాయి. మరీ అయిదారు వందల కోట్ల రేంజ్ లో కాకపోయినా డబుల్ సెంచరీ దాటడం ఖాయమనే నమ్మకంతో నిర్మాతలు ఉన్నారు. అందుకే దానికి తగ్గట్టే సుక్కు చాలా కీలకమైన మార్పులు చేస్తున్నట్టు తెలిసింది. ఇక్కడైతే ఫోకస్ ఉండదనే ఉద్దేశంతో విదేశాలకు వెళ్లిపోయారు. ఇది పూర్తి చేస్తే కానీ అల్లు అర్జున్ కొత్త సినిమా గురించి ఆలోచించలేడు. అప్పటిదాకా ఆ గెడ్డాన్ని అలా మైంటైన్ చేయాల్సిందే.

రెండు మూడు పాత్రలు తప్ప పుష్పలో అందరూ కంటిన్యూ అవుతారు. అదనంగా బాలీవుడ్ క్యాస్టింగ్ ఉండే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు దేవిశ్రీప్రసాద్ ట్యూన్ల కోసం కసరత్తు మొదలుపెట్టాడు. ఊ అంటావాని మించిన ఐటెం సాంగ్ ఉంటుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. దిశా పటానిని అడిగారని టాక్ వచ్చింది. ఒకవేళ పుష్ప 2 వేసవిలో మొదలైతే 2023 సంక్రాంతి లేదా మార్చ్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. పార్ట్ వన్ లాగా హడావిడి పడకుండా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. బన్నీ ఫహద్ ఫాసిల్ మధ్య యుద్ధం ఏ స్థాయిలో ఉంటుందోనని అప్పుడే రకరకాల అంచనాలు మొదలయ్యాయి. కెజిఎఫ్ 2 లాగా పుష్పరాజ్ పాత్రకు ముగింపు ఉంటుందో లేదో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి