iDreamPost

Allu Arjun: పుష్ప 2 దెబ్బకు వణుకుతున్న రికార్డ్స్.. ఇది బన్నీ మాస్ రేంజ్!

పుష్ప 2 మూవీ విడుదలకు ముందే సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకెళ్తోంది. దీంతో ఈ మూవీపై రోజురోజుకు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరో పుష్పరాజ్ మరో రేర్ ఫీట్ ను సాధించినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

పుష్ప 2 మూవీ విడుదలకు ముందే సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకెళ్తోంది. దీంతో ఈ మూవీపై రోజురోజుకు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరో పుష్పరాజ్ మరో రేర్ ఫీట్ ను సాధించినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Allu Arjun: పుష్ప 2 దెబ్బకు వణుకుతున్న రికార్డ్స్.. ఇది బన్నీ మాస్ రేంజ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 విడుదలకు ముందే పలు రికార్డులను బద్దలు కొడుతూ.. దూసుకెళ్తోంది. ఇటీవలే బన్నీ బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ ఏ రేంజ్ రెస్పాన్స్ ను దక్కించుకుందో మనందరం చూశాం. యూట్యూబ్ లో రికార్డ్ వ్యూయర్ షిప్ ను సొంతం చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఇండియన్ టాప్ స్టార్స్ సైతం టచ్ చేయలేని రికార్డ్స్ ను సృష్టిస్తోంది. దీంతో పుష్ప 2 దెబ్బకు రికార్డులకు జ్వరం పట్టుకుంటోంది. తాజాగా మరో క్రేజీ న్యూస్ పుష్ప 2 రేంజ్ ను పదిరెట్లు పెంచింది. అదేంటంటే?

పుష్ప 2 దెబ్బకు రికార్డ్స్ వణుకుతున్నాయి. ఇటీవలే టీజర్ దెబ్బకు యూట్యూబ్ ఏ రేంజ్ లో షేక్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గంటల్లోనే లక్షల కొద్ది వ్యూస్ ను సొంతం చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేశాడు పుష్పరాజ్. అసలు విషయం ఏంటంటే? పుష్ప 2 కోసం తెలుగు ఆడియన్స్ కంటే బాలీవుడ్ ప్రేక్షకులే ఎక్కువ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. దీంతో అందుకు తగ్గట్లుగానే అక్కడ భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. పుష్ప 2 ప్రిరిలీజ్ బిజినెస్ కేవలం నార్త్ లోనే రూ. 200 చేస్తోందని టాక్. గతంలో ఏ తెలుగు సినిమా కూడా నార్త్ బెల్ట్ లో ఈ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేయలేదట. అక్కడ రూ. 200 కోట్ల బిజినెస్ అంటే మామూలు విషయం కాదు.

దీంతో ఓవరాల్ థియేట్రికల్ బిజినెస్ లో సైతం పుష్ప 2 మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు సౌత్ నుంచి రూ. 900 కోట్ల బిజినెస్ తో RRR టాప్ లో ఉంది. ఇక ఇప్పుడు పుష్ప క్రేజ్ చూస్తే.. ఈ రికార్డు బద్దలవుతుందని అభిమానులు ధీమాగా చెబుతున్నారు. డైరెక్టర్ సుకుమార్ క్రియేటీవ్ టేకింగ్, బన్నీ మాస్ యాక్టింగ్ తోడు కావడంతో.. ఈ రేంజ్ హైప్ క్రియేట్ అవుతోందని సినీ పండితులు పేర్కొంటున్నారు. మరి విడుదలకు ముందు సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న పుష్ప 2పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి