iDreamPost

Pushpa-2: పుష్ప-2 మూవీ జాతర సీన్ కు థియేటర్ లో పూనకాలే !

  • Published Feb 21, 2024 | 11:27 AMUpdated Feb 21, 2024 | 11:27 AM

ప్రస్తుతం స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ నెట్టింట షికార్లు చేస్తోంది.

ప్రస్తుతం స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ నెట్టింట షికార్లు చేస్తోంది.

  • Published Feb 21, 2024 | 11:27 AMUpdated Feb 21, 2024 | 11:27 AM
Pushpa-2: పుష్ప-2 మూవీ జాతర సీన్ కు థియేటర్ లో పూనకాలే !

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ అంటే ఆడియన్సుకు ఎక్స్పెక్టషన్స్ భారీగా ఉంటాయి. ఇదివరకే వీరి కాంబినేషన్ లో వచ్చిన హిట్ చిత్రాల గురించి అందరికి తెలిసిన విషయమే. ఇక పుష్ప పార్ట్-1 సినిమా వరల్డ్ వైడ్ గా తెచ్చుకున్న టాక్ అంత ఇంత కాదు. పుష్ప సినిమాతో.. ఈ సినిమాలో నటించిన వారంతా .. పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. కాబట్టి ఇక ఇప్పుడు రాబోతున్న పుష్ప-2 సినిమాను అందరి అంచనాలకు మించి తీసుకుని వెళ్లాలంటే.. సుకుమార్ ఖచ్చింతంగా ఈ సినిమాలో మాస్ జాతర చూపించాల్సిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ఇంటర్వెల్ కు ముందు జరగబోయే.. జాతర సీన్స్ గురించి కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట షికార్లు చేస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

సాధారణంగా స్టార్ డైరెక్టర్ల చిత్రాలలో .. ప్రత్యేకించి ఇంటర్వెల్ సీన్స్ కు ఉండే ఫ్యాన్ బేస్ సెపరేట్ ఉంటుంది. ఆ ఒక్క ఇంటర్వెల్ బ్యాంగ్ టోటల్ సినిమా కంటెంట్ కు ఓ అర్ధాన్ని తీసుకుని వస్తుందని అంతా భావిస్తారు. ఈ విషయంలో తెలుగు ఇండస్ట్రీలో దర్శక ధీరుడు రాజమౌళిని మించిన వారు ఎవరు ఉండరు. అసలు రాజమౌళి చిత్రాలలో ఇంటర్వెల్ సీన్స్ లో ఉండే మ్యాజిక్ ఏ వేరు . జక్కన్న సినిమాలలో ఇంటర్వెల్ సీన్స్ అన్ని చాలా ఐకానిక్ గా ఉంటాయి. ఇక ఇప్పుడు సరిగ్గా ఇలానే సుకుమార్ కూడా ప్లాన్ చేస్తున్నారట. పుష్ప -2 సినిమాలో ఇంటర్వెల్ కు ముందు వచ్చే.. జాతర సీన్ విషయంలో.. ఈ దర్శకుడు అసలు రాజీ పడడం లేదట. ఆ ఒక్క జాతర సీన్ ను చిత్రీకరించడానికి.. దాదాపు ఓ మీడియం మూవీ తీయడానికి తీసుకునే అన్ని రోజులను కేటాయిస్తున్నారట. చూడబోతుంటే పుష్ప-2 సినిమాలో ఇంటర్వెల్ సీన్.. ఇప్పటివరకు మిగిలిన సినిమాలలో వచ్చిన ఐకానిక్ సీన్స్ కు మించి ఉంటోందనిపిస్తుంది. దీనితో ఇప్పుడు పుష్ప-2 చిత్రంపైన అందరికి భారీగా ఎక్స్పెక్టషన్స్ పెరిగిపోయాయి.

అంతేకాకుండా సుకుమార్, బన్నీ ఈ మూవీ కోసం ఇప్పటినుంచే ఫ్రాంచైసింగ్ స్టార్ట్ చేశారు. ఇటీవల జెర్మనీలో జరిగిన బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ..అల్లు అర్జున్, ఈ సినిమా నిర్మాత అటెండ్ అయ్యారు. దీనికోసం అల్లు అర్జున్ తన షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకుని మరీ వెళ్ళాడు. చూడబోతుంటే ఈ సినిమాను ఎంత భారీగా తెరకెక్కిస్తున్నారో.. అదే రేంజ్ లో వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తారనిపిస్తోంది. ఇక ఇప్పటికే అందరికి భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాపై.. రానున్న రోజుల్లో ఎలాంటి అప్ డేట్స్ వస్తాయో వేచి చూడాలి. దర్శకుడు మాత్రం ఈ సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడా తగ్గడంలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి, పుష్ప-2 మూవీ ఇంటర్వెల్ సీన్ గురించి వస్తున్న టాక్స్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి