• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » news » Alla Nani Press Meet About Corona

ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లు,మాల్స్ మూసివేత – ఆళ్ల నాని

  • By iDream Post Published Date - 11:36 AM, Thu - 19 March 20 IST
ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లు,మాల్స్ మూసివేత – ఆళ్ల నాని

ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ప్రతిరోజూ కరోనా వైరస్ కట్టడికి సమీక్ష నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖా మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.

మీడియా సమావేశంలో ఆళ్ల నాని మాట్లాడుతూ వైరస్ వ్యాప్తిపై అపోహలను కలిగించి ప్రజలను భయాందోళనలకు గురి చేయొద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేసారు. వైరస్ కట్టడి చేయడానికి అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నామని అందులో భాగంగా విద్యా సంస్థలకు ఈ నెల 31 వరకూ సెలవులను ప్రకటించామని వైద్యశాఖా మంత్రి ఆళ్ళ నాని వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ లో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, విదేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరిని ఐసోలేషన్ సెంటర్లకు తరలిస్తున్నామని, తిరుపతి,విజయవాడ,కాకినాడలో ల్యాబ్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి జిల్లా ఆసుపత్రిలోనూ మెడికల్ కాలేజీల్లోనూ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామని వ్యాఖ్యానించారు. ప్రజలంతా వైద్య,ఆరోగ్య శాఖాధికారులు చెప్పిన సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేసారు.

కొన్ని ఆలయాల్లో రద్దీని తగ్గిస్తామని,దేవాలయాలు , చర్చ్ లు, మసీదులు, యథాతథంగా ఉంటాయని తెలిపారు. థియేటర్లు, మాల్స్ మూసివేస్తామని తెలిపారు. పెళ్ళిళ్ళను వాయిదా వేసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజలెవరూ కరోనా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఆళ్ళ నాని స్పష్టం చేశారు.

కాగా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భక్తుల దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే అలిపిరి టోల్‌ గేట్‌ను టీటీడీ అధికారులు మూసివేశారు. శ్రీవారి మెట్టు, అలిపిరి నడకమార్గాలను కూడా టీటీడీ అధికారులు మూసివేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి శ్రీవారి దర్శనాలను నిలిపివేయనున్నారు. అయితే శ్రీవారికి జరిగే ఏకాంత సేవలను అర్చకులు యథాతథంగా నిర్వహించనున్నారు.

Tags  

  • Alla Nani
  • AP
  • CM Jagan
  • Coronavirus
  • ttd
  • ఆళ్ల నాని
  • కరోనా వైరస్
  • తిరుమల తిరుపతి దేవస్థానం
  • సీఎం జగన్

Related News

మందుబాబులకు షాకింగ్ న్యూస్.. ఆ తేదీ వరకు మద్యం షాప్స్ బంద్!

మందుబాబులకు షాకింగ్ న్యూస్.. ఆ తేదీ వరకు మద్యం షాప్స్ బంద్!

బాధైనా, సంతోషమైన ముందు గుర్తొచ్చేది మద్యమే. తమ సంతోషాలను బాధలను మద్యంతోనే సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఈ క్రమంలో చుక్క పడనిదే పొద్దుగడవని మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్ తెలిపారు అధికారులు. ఆ తేదీల్లో మద్యం షాప్స్, కల్లు దుకాణాలను బంద్ చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో ఆ ప్రాంతాల్లో ఆ తేదీ వరకు మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి. దీంతో మద్యం ప్రియులు ఉసూరుమంటున్నారు. అయితే గణేష్ నిమజ్జనం కారణంగానే మద్యం అమ్మకాలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఇంతకీ […]

6 hours ago
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎవరూ డబ్బులు ఇవ్వొద్దన్న టీటీడీ

శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎవరూ డబ్బులు ఇవ్వొద్దన్న టీటీడీ

14 hours ago
తిరుమల నడకదారిలో బోన్ చిక్కిన మరో చిరుత!

తిరుమల నడకదారిలో బోన్ చిక్కిన మరో చిరుత!

2 days ago
వీడియో: ఆలయంలో చోరీ.. హుండీలో నగదు కొట్టేసిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్

వీడియో: ఆలయంలో చోరీ.. హుండీలో నగదు కొట్టేసిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్

2 days ago
వారికి జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. రేపే చెక్కుల పంపిణీ!

వారికి జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. రేపే చెక్కుల పంపిణీ!

3 days ago

తాజా వార్తలు

  • 9 ఏళ్లు ఆయనతో ప్రేమలో ఉన్నా.. కానీ ఆ విషయం లగ్నపత్రికతోనే తెలిసింది!
    3 hours ago
  • రైతులకు అలర్ట్.. ఆ పని చేయకపోతే నష్టపోతారు!
    3 hours ago
  • సమంత గ్రేట్‌.. ఇలా నిజం ఒప్పుకునే ధైర్యం ఎవరికి ఉంది?
    3 hours ago
  • డాక్టర్‌ నిర్వాకం.. కడుపులో కత్తి వదిలేశాడు..
    3 hours ago
  • ఆస్కార్ రేసులో ‘బలగం’, ‘దసరా’.. ఆ సినిమాతోనే తెలుగు మూవీస్​కు పోటీ!
    4 hours ago
  • విద్యార్థితో గుంజీలు తీయించాడని.. టీచర్ పై పేరెంట్ దాడి.. వీడియో వైరల్
    4 hours ago
  • కూతురి మరణం.. విజయ్‌ ఆంటోనీ ఎమోషనల్‌ లేఖ!
    4 hours ago

సంఘటనలు వార్తలు

  • ‘సలార్’ గురించి ఇక మర్చిపోండి.. ప్రభాస్ మూవీ ఇప్పట్లో లేనట్లే!
    5 hours ago
  • గుడ్ న్యూస్ చెప్పిన TSRTC.. ప్రయాణికులకు బంపరాఫర్!
    5 hours ago
  • 7/G రీ రిలీజ్! 20 ఏళ్ళ తరువాత కూడా ఇంత క్రేజ్ కి కారణం?
    5 hours ago
  • వీడియో: చాయ్ కోసం వెళ్లిన పోలీసులు.. వ్యాన్ నుంచి తప్పించుకుని పారిపోయిన ఖైదీలు
    5 hours ago
  • టీమిండియాలో అతడే నెక్స్ట్ కోహ్లీ.. వరల్డ్ కప్​లో దంచికొడతాడు: రైనా
    6 hours ago
  • ప్రజలపై రెచ్చిపోయిన సీఎం కుమారుడు.. డబ్బు పిచ్చి పట్టిందంటూ..
    6 hours ago
  • సూర్యపై మాకు నమ్మకం ఉంది! అతన్ని ఇంకా సపోర్ట్‌ ఇస్తాం: ద్రవిడ్‌
    6 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version