iDreamPost

షూటింగులనూ వదలని కోవిడ్ 19 – అన్నీ షట్ డౌన్

షూటింగులనూ వదలని కోవిడ్ 19 – అన్నీ షట్ డౌన్

నిన్న చిరంజీవి తన ఆచార్య షూటింగ్ ని నెలాఖరు దాకా వాయిదా వేస్తున్నానని ప్రకటించి 24 గంటలు గడవక ముందే పరిశ్రమ మొత్తం అదే మాట మీద వచ్చేసింది. మార్చ్ 31 దాకా అన్ని సినిమాల షూటింగులు రద్దు చేస్తున్నట్టు ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తరఫున అధికారిక ప్రెస్ నోట్ వచ్చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఈ వైరస్ కట్టడికి తీవ్ర చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అందుకు మద్దతుగా టాలీవుడ్ తో పాటు మొత్తం దేశ సినీ పరిశ్రమ ఇదే నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

దాని ప్రకారం ఈ నెల 19 నుంచి 31 దాకా సినిమాలు, టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్ లకు సంబంధించి ఎలాంటి షూటింగులు జరగకూడదు. దేశవ్యాప్తంగా వైరస్ కు సంబంధించి హై అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో జన సందోహం చాలా అధికంగా ఉండే షూటింగులను తాత్కాలికంగా ఆపేయడం మంచి డెసిషనే. రాష్ట్రాలతో సంబంధం లేకుండా జాతీయ స్థాయిలో తీసుకున్న ఉమ్మడి నిర్ణయం కాబట్టి అందరూ పాటించాల్సిందే. ఇప్పటికే కేరళ, కర్ణాటక, ఢిల్లీలలో కఠిన చర్యలు అమలులో ఉన్నాయి. మెడికల్ ఎమర్జెన్సీ కింద ఇప్పటికే థియేటర్లు మాల్స్ మొత్త పడ్డాయి.

మంచి ఉద్దేశమే అయినప్పటికీ ఇప్పుడీ రద్దు వల్ల నిర్మాతలతో సహా 24 క్రాఫ్ట్స్ కు సంబంధించిన అందరూ ఇబ్బందులు పడక తప్పదు. రెండు వారాల పాటు మొత్తం స్తంభించిపోనుంది. నాని వి మాత్రమే విడుదల పరంగా ఇప్పటిదాకా అధికారికంగా వాయిదా పడిన సినిమా. 21 దాకే థియేటర్ల బంద్ అని ప్రకటించారు కాబట్టి మిగిలిన సినిమాల నిర్మాతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఒకవేళ 22 నుంచి ఓపెన్ చేయొచ్చంటే 25కు రిలీజులు రెడీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. రానున్న రోజుల్లో దీనికి సంబంధించి చాలా కీలకమైన పరిణామాలు జరగబోతున్నాయి. సో థియేటర్లే కాదు స్టూడియోలు ఔట్ డోర్లు ఖాళీగా నిశ్శబ్దాన్ని ఆవరించబోతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి