iDreamPost

రూ.65 వేల డిస్కౌంట్.. సరికొత్త లుక్స్, సేఫ్టీ ఫీచర్స్ కూడా!

All New Realut Kiger Price And Specifications: అందరూ ఫోన్ల మీద ఆఫర్స్ మాత్రమే చూస్తున్నారు. కానీ ఇప్పుడు కార్ల మీద రూ.వేలల్లో డిస్కౌంట్స్ నడుస్తున్నాయి.

All New Realut Kiger Price And Specifications: అందరూ ఫోన్ల మీద ఆఫర్స్ మాత్రమే చూస్తున్నారు. కానీ ఇప్పుడు కార్ల మీద రూ.వేలల్లో డిస్కౌంట్స్ నడుస్తున్నాయి.

రూ.65 వేల డిస్కౌంట్.. సరికొత్త లుక్స్, సేఫ్టీ ఫీచర్స్ కూడా!

ప్రస్తుతం అందరూ ఇ-కామర్స్ సైట్స్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో ఆఫర్స్ బోర్డులు చూస్తున్నారు. న్యూ ఇయర్ సేల్.. అప్ టూ 80% డిస్కౌంట్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు. అలాగే మొబైల్స్ మీద కూడా ఆఫర్స్ ఉంటున్నాయి. అయితే మీరు ఎప్పుడైనా కార్ల మీద ఎందుకు అలా డిస్కౌంట్స్, ఆఫర్స్ ఇవ్వరు అని అనుకున్నారా? అలా అనకున్నా.. లేకపోయినా.. మీకోసం అయితే ఇప్పుడు రెనాల్ట్ ఇండియా కంపెనీ కార్ల మీద మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి. పైగా 2024కి సంబంధించి సరికొత్త మోడల్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. అవి పాత మోడల్స్ తో పోలిస్తే మంచి లుక్స్ మాత్రమే కాకుండా.. ఫీచర్స్ తో వస్తున్నాయి.

రెనాల్ట్ కంపెనీకి భారత మార్కెట్ లో మంచి ఆదరణ ఉంది. కానీ, ఎందుకో చాలామంది ఈ కార్లు అంటే లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ, బడ్జెట్ రేంజ్ లో అదిరిపోయే ఫీచర్లతో ఈ కార్లు వస్తూ ఉంటాయి. ఈ కంపెనీకి చెందిన రెనాల్ట్ కిగర్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. మార్కెట్ లో బాగా అమ్ముడయ్యే మోడల్ కూడా ఇది. ఇప్పుడు ఈ కారు ధరలో కంపెనీ రూ.65 వేల వరకు తగ్గింపు ప్రకటించింది. ఈ ఆఫర్ కేవలం జనవరి వరకు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా సరికొత్త ఫీచర్లతో మోడల్ ని తీసుకొస్తూ ఇలాంటి ఆఫర్లు ఇవ్వడంతో వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. గత కిగర్ మోడల్ కి కూడా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. బడ్జెట్ రేంజ్ కార్లలో కిగర్ కు మంచి స్థానం ఉంది. ఇప్పుడు రెనాల్ట్ కంపెనీ కిగర్ ని సరికొత్త ఫీచర్స్, భద్రతా ప్రమాణాలతో తీసుకొస్తోంది.

ఈ 2024 కిగర్ ఎక్స్ షో రూమ్ ధర రూ.6 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. ఈ మోడల్ హై ఎండ్ కారు ఎక్స్ షో రూమ్ ధర రూ.11 లక్షలుగా ఉంది. ఇందులో మొత్తం 21 వరకు వేరియంట్స్ ఉన్నాయి. మీరు వేరియంట్ పెంచుకునే కొద్ది ధర పెరగడమే కాకుండా.. మంచి ఫీచర్స్ కూడా లభిస్తాయి. ఇంక ఇంజిన్ విషయానికి వస్తే.. 999సీసీ నుంచి 1199సీసీ వరకు లభిస్తుంది. ఇందులో 2 ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 1.0 లీటర్ న్యాచురల్ యాస్పైర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. అది 72పీఎస్/ 96ఎన్ఎం టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మరొకటి 1.0 లీటర్ పెట్రోల్ టర్బో ఇంజిన్. ఇది 100పీఎస్/ 160ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో మాన్యూవల్, ఆటోమేటిక్ ట్రాన్సిషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్యూయల్ మాత్రం కేవలం పెట్రోల్ ఆప్షన్ మాత్రమే ఉంది.

ఈ కిగర్ ఫీచర్స్ చూస్తే.. ఇందులో 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. 7 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ క్లస్టర్ కూడా ఉంటుంది. అలాగే వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే ఉంటుంది. పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, ఆటోమేటిక్ క్లయిమెట్ కంట్రోల్, వైర్ లెస్ ఫోన్ ఛార్జర్, టర్బో వేరియంట్స్ లో క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. పీఎం 2.5 ఎయిర్ ఫిల్టర్ కూడా ఉంటుంది. అలాగే కలర్ ఆప్షన్స్ కూడా ఎన్నో ఉన్నాయి. ఇందులో మీకు రేడియంట్ రెడ్, మెటల్ మస్టర్డ్, కాస్పియన్ బ్లూ, మూన్ లైట్ సిల్వర్, ఐస్ కూల్ వైట్, మోహోగ్యానీ బ్రౌన్, స్టెల్త్ బ్లాక్ అనే 6 రకాల సింగిల్ టోన్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే బ్లాక్ రూఫ్ తో 4 డ్యూయల్ టోన్ కలర్స్ కూడా ఉన్నాయి.

ఈ కారు సేఫ్టీ ఫీచర్స్ గురించి మరింత ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ 2024 రెనాల్ట్ కిగర్ మరింత అప్ డేటెడ్ సేఫ్టీ ఫీచర్స్ తో వస్తోంది. ఇందులో మీకు 4 ఎయిర్ బ్యాగ్స్ లభిస్తాయి. ఏబీఎస్- ఈబీడీ, ఎలక్ట్రానికి స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, రేర్ పార్కింగ్ సెన్సార్స్, రేర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది. ఈ ఫీచర్స్ రెనాల్ట్ కిగర్ మరింత ప్రత్యేకంగా మారుస్తున్నాయి. 2021లో క్రాష్ టెస్ట్ చేయగా కిగర్ కి 4/5 స్టార్ రేటింగ్ దక్కింది. ఇప్పుడు మారిన సేఫ్టీ ఫీచర్స్ తో ఆ పాయింట్స్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. మరి.. ఈ ఆల్ న్యూ రెనాల్ట్ కిగర్ మోడల్ ఫీచర్స్, ఆఫర్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి